Telegram CEO : టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్‌తో మిస్టీరియస్ మహిళకు లింకేంటి? ఇంతకీ, ఎవరీ జూలీ వావిలోవా?

Telegram CEO : జూలీ వావిలోవా టెలిగ్రామ్ సీఈఓతో కలిసి కజాఖ్స్తాన్, కిర్గిజ్స్తాన్, అజర్‌బైజాన్ వంటి వివిధ ప్రదేశాలలో కనిపించింది. వీరిద్దరి ఫొటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో కూడా పోస్టు చేసింది.

Mysterious Woman Linked To Arrest Of Telegram CEO

Telegram CEO : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను లె బోర్గెట్ విమానాశ్రయంలో ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిలియనీర్ వ్యవస్థాపకుడిగా పేరొందిన పావెల్ రోవ్‌ను “రష్యా మార్క్ జుకర్‌బర్గ్” అని కూడా పిలుస్తారు. దాదాపు 900 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు కలిగిన టెలిగ్రామ్‌లో నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్టుగా ఆరోపణలతో అరెస్టయ్యారు.

Read Also : Vivo T3 Pro 5G : వివో సరికొత్త 5జీ ఫోన్ చూశారా? ఈ నెల 27నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ముఖ్యంగా, దురోవ్ అరెస్టు సమయంలో ఆయనతో పాటు ఓ మహిళ కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నివేదికల ప్రకారం.. ఆ రహస్య మహిళ పావెల్ గర్ల్‌ఫ్రెండ్ అనే ఊహాగానాల నేపథ్యంలో ఆయనతో పాటు ఆమెను కూడా అరెస్టు చేశారు పోలీసులు. దురోవ్ అరెస్ట్ కావడానికి కారణం కూడా జూలీ వావిలోవా అనే మహిళ కారణమని భావిస్తున్నారు.

జూలీ వావిలోవా ఎవరంటే?
24ఏళ్ల జూలీ వావిలోవా దుబాయ్ నుంచి క్రిప్టో కోచ్ స్ట్రీమర్. ఇన్‌స్టాగ్రామ్‌లో, 20వేల కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. వావిలోవా ఒక గేమర్‌ కూడా. అంతేకాదు.. ”గేమింగ్, క్రిప్టో, లాంగ్వేజెస్, మైండ్‌సెట్” వంటివి తన బయోలో పేర్కొంది. ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, అరబిక్ అనే నాలుగు భాషలలో కూడా అనర్గళంగా మాట్లాడగలదు.

ఆసక్తికర విషయం ఏంటంటే.. జూలీ వావిలోవా టెలిగ్రామ్ సీఈఓతో కలిసి కజాఖ్స్తాన్, కిర్గిజ్స్తాన్, అజర్‌బైజాన్ వంటి వివిధ ప్రదేశాలలో కనిపించింది. వీరిద్దరి ఫొటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో కూడా పోస్టు చేసింది. ఫ్రాన్స్ అధికారులు వీరిద్దరిని అరెస్టు చేయడానికి ముందు ఒక ప్రైవేట్ జెట్‌లో పారిస్‌కు చేరుకున్నారు. అక్కడే వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్తుడటంతో వీరిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందనే ఊహాగానాలకు దారితీసింది.

పారిస్‌లో పావెల్ దురోవ్‌తో ఉన్న ఫొటోలతో సహా ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లు, క్రిప్టో కమ్యూనిటీలో ఉద్దేశపూర్వకంగా అధికారులను తప్పుదారి పట్టించి ఉండవచ్చు అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పావెల్ అరెస్టుతో ఆమెకు ప్రమేయం ఉందనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. హనీట్రాప్ నుంచి మొసాద్ ఏజెంట్‌ అనే కోణంలో కూడా సందేహాలు నెలకొన్నాయి.

Read Also : Telegram CEO : టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌ అరెస్ట్.. కారణం ఏమిటంటే?

ట్రెండింగ్ వార్తలు