Regent HoneyEater bird : అంతరించిపోతున్న పక్షి..‘పాట పాడటమే మరచిపోయింది’

Regent HoneyEater bird on the verge of extinction : ఈ ప్రపంచంలో జరుగుతున్న పర్యావరణ మార్పులతో ఎన్నో జీవజాతుల అంతరించిపోతున్నాయి. ఇప్పటికే పలు జాతులు అంతరించిపోయాయి. వాటిని నెట్ లో చూసుకోవటం తప్ప నేరుగా చూసే పరిస్థితి లేకుండా పోయింది. అలా అంతరించి పోతున్న జాతుల్లో ఎన్నో రకాల ప్రాణులున్నాయి. వాటి జాబితాలో చేరిపోయింది ‘‘హనీఈటర్’’ అనే పక్షి జాతి. ఒకప్పుడు ఆస్ట్రేలియా ఆగ్నేయ భాగంలో రీజెంట్ హనీఈటర్ పక్షి ఎక్కువగా కనిపించేవి. కానీ వీటి సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. దాదాపు అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలోకి చేరిపోయింది హనీఈటర్. ప్రపంచవ్యాప్తంగా హనీఈటర్ జాతి పక్షులు ప్రస్తుతం కేవలం 300 మాత్రమే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు.

“పర్యావరణంలో జరుగుతున్న మార్పుల రీత్యా ఈ పక్షులు తమ తోటి రీజెంట్ హనీఈటర్లతో కలిసి తిరిగే అవకాశం లేకుండో పోతోంది. దీంతో ఇవి అంతరించిపోతున్న జాబితాలో చేరిపోయాయి. అంతేకాదు రీజెంట్ హనీఈటర్ పక్షులు చక్కగా పాటలు పాడతాయి మన కోకిలమ్మల్లాగా. కానీ తమ జాతి లాగా పాటలు పాడటం కూడా మానేస్తున్నాయట. పాట పాడటం మరచిపోతున్నాయట.

తమ జాతి పక్షుల్లాగా ఎలా పాడాలో నేర్చుకునే అవకాశం కూడా వీటికి దొరకటం లేదని కాన్‌బెర్రా లోని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో డిఫికల్ట్ బర్డ్ రీసెర్చ్ గ్రూపులో సభ్యుడైన డాక్టర్ రాస్ క్రేట్స్ తెలిపారు. రీజెంట్ హనీ ఈటర్ పక్షుల గురించి డాక్టర్ రాస్ కేట్స్ తెలిపిన వివరాలను యూకే రాయల్ సొసైటీ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించారు.

రీజెంట్ హనీఈటర్ పక్షి పాడే పాటల్ని సంరక్షించేందుకు డాక్టర్ రాస్ పలు యత్నాలు చేస్తున్నారు. వాటిని ఎలాగైనా పాడించాలని యత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా రాస్ క్రేట్స్ కొన్ని హనీ ఈటర్ పక్షులను పట్టుకుని బంధించి వాటి బంధువులు పాడిన పాటలను వాటికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాటలు విని అవికూడా పాడేలా యత్నిస్తున్నారు. మూగవారిని మాట్లాడించటానికి చేసే స్పీచ్ థెరపీలాగా..అలాగే హనీ ఈటర్ పక్షులు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాలని యత్నిస్తున్నారు. అన్వేషిస్తున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాస్ క్రేట్స్ మాట్లాడుతూ..రీజెంట్ హనీఈటర్ పక్షులు ఇవి చాలా అరుదైనవనీ..యూకే విస్తీర్ణంలో కొన్ని ప్రాంతాల్లో భారీ విస్త్రీర్ణంలో ఉండే స్థలంలో ఉంటాయనీ..దీంతో ఈ పక్షుల్ని వెదకటం చాలా కష్టమని తెలిపారు. ఈ పక్షుల్ని వెతికే క్రమంలో ఆయన కొన్ని విచిత్రమైన పాటలు పాడుతున్న మరి కొన్ని పక్షుల్ని గుర్తించారు. అవి అలా పాడుతుంటే భలే సంతోషంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. వాటిని చూసి మొదట్లో హనీ ఈటర్స్ అనుకున్నాం. కానీ అవి ఇవీ ఒకటి కాదని తెలిపారు. అలా పాటలు పాడే పక్షలు రీజెంట్ హనీఈటర్‌లా పాడటం లేదు. అవి వేరే జాతికి చెందినవని అర్ధమైంది. మనుషులు ఒకరి నుంచి ఒకరు మాట్లాడటం నేర్చుకున్నట్లే పాటలు పాడే పక్షులు కూడా పాట పాడే విధానాన్ని నేర్చుకుంటాయని తెలిపారు రాస్.

పక్షులు పెరిగి పెద్దయ్యాక వాటి గూడును వదిలి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టేటప్పుడు అవి వయసులో ఉన్న మగ పక్షులతో కలవడం చాలా అవసరం. అలాచేస్తేనే వాటి సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు ఆడపక్షులు మగ పక్షులతో కలవటం వలన అవి ఎలా పాడుతున్నాయో విని ఆ పాటను తిరిగి పాడటం మొదలు పెడతాయని తెలిపారు. రీజెంట్ హనీఈటర్ 90 శాతం జీవావరణాన్ని కోల్పోయింది. దీనివల్ల చిన్న మగ పక్షులు మిగిలిన పక్షులకు తారసపడి అవి పాడే పాటలు వినే అవకాశం ఉండటం లేదు. దీంతో, అవి వేరే పక్షుల పాటలు వినాల్సి వస్తోంది..దీంతో అవి తమ సహజమైన జాతి పాటను పాడటం మరచిపోతున్నాయని తెలిపారు డాక్టర్ రాస్.

రీజెంట్ హనీఈటర్ల జనాభాలో 12 శాతం సహజమైన పాట మాయమైపోయిందని ఈ అధ్యయనంలో తేలింది. హనీ ఈటర్స్ పాడే పాటను సంరక్షించాలనే ఆశతో శాస్త్రవేత్తలు ఆ పక్షుల పాటలను రికార్డు చేసి హనీఈటర్లకు వినిపిస్తున్నారు. ఆ పాటలు విని అవి పాడతాయనే ఆశతో..

అలాగే ఈ పక్షుల జనాభాను పెంచటానికి వాటిని పట్టుకుని బంధించిన రీజెంట్ హనీఈటర్‌లలో కొన్నిటిని ప్రతి ఏటా తిరిగి అడవిలో వదిలిపెట్టే ప్రాజెక్టు నడుస్తోంది. కానీ.. ఆ మగ పక్షులు మరో రకమైన విచిత్రమైన పాటను పాడితే మాత్రం ఆడ పక్షులు వాటితో కలవడానికి రావని డాక్టర్ రాస్ ఆందోళన వ్యక్తంచేశారు. అలా జరిగితే వీటి సంఖ్య ఇంకా తగ్గిపోయే ప్రమాదముందని తెలిపారు. అవి పాడాల్సిన వాటిపాటను వింటే..వాటంతట అవే వాటి పాటను పాడటం నేర్చుకుంటాయని ఆశిస్తున్నామని డాక్టర్ రాస్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు