Russia-Ukraine Conflict : ప్రధాని మోదీకి యుక్రెయిన్ అధ్యక్షుడి ఫోన్.. రష్యా దురాక్రమణ ఆపాలని విజ్ఞప్తి!

రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో యుక్రెయిన్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది.

Russia-Ukraine Conflict : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో యుక్రెయిన్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది. రష్యా బలగాను నిలువరించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ  ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. తమ దేశానికి  భారత్ మద్దతు కావాలని ఫోన్ ద్వారా కోరారు.

రష్యా దురాక్రమణ ఆపాలని విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది రష్యా బలగాలు తమ దేశంలోకి చొరబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా దురాక్రమణపై ఐక్యరాజ్య సమితిలో తమ దేశానికి మద్దతు ఇవ్వాలని యుక్రెయిన్ అధ్యక్షుడు మోదీని కోరారు. ప్రస్తుతం యుక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులకు సంబంధించి జెలెన్ స్కీ మోదీకి వివరించారు. తమ నివాస గృహాలపై కాల్పులు జరుపుతున్నారని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతామండలిలో తమ దేశానికి మద్దతు ఇవ్వాలని యుక్రెయిన్ అధ్యక్షుడు కోరారు.

మరోవైపు.. రష్యాతో యుక్రెయిన్ ఒంటరిగానే పోరాడుతోంది. ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో చావోరేవో అన్నట్టుగా రష్యాపై ప్రతిఘటిస్తోంది యుక్రెయిన్.. రష్యా చర్యలను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నించినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గలేదు. చేసేది ఏమిలేక యుక్రెయిన్ ఒకటే రష్యాను నిలువరించేందుకు తన దగ్గరి ఆయుధాలతో అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో నాటో దేశాల్లో కదలిక మొదలైంది. ఆయుధ సాయం అందించేందుకు నాటో దేశాలు ముందుకొస్తున్నాయి. ఆయుధాలను అందించేందుకు చెక్ రిపబ్లిక్ కూడా ముందుకొచ్చింది.

తాము కూడా ఆయుధాలు పంపిస్తామని బ్రిటన్ వెల్లడించింది. మరో 20 దేశాలు కూడా యుక్రెయిన్‌కు సాయం అందించేందుకు సంసిద్ధతను ప్రకటించాయి. ఈ దేశాలు యుక్రెయిన్ తరపున రష్యాపై నేరుగా నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా ఆయుధాలను అందించేందుకు నాటో దేశాలు ముందుకు వచ్చాయి. నాటో దేశాలు సహకారంతో యుక్రెయిన్ ఊపిరి పీల్చుకుంటోంది. నాటో దేశాలు రంగంలోకి దిగడంతో ఎక్కడిక్కడ రష్యాకు బ్రేక్ వేస్తున్నాయి. తమ తీరంలో రష్యా కార్గో నౌకను ఫ్రాన్స్ కూడా అడ్డుకుంది.

Read Also : Ukraine Kyiv Curfew : యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో కర్ఫ్యూ.. రోడ్లపైకి ఎవరూ రావొద్దంటూ హెచ్చరిక!

ట్రెండింగ్ వార్తలు