Russia-Ukraine crisis: ‘వెయిట్ చేయొద్దు.. వెంటనే రిటర్న్ అయిపోండి’

రష్యా.. యుక్రెయిన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఎంబస్సీ ఫిబ్రవరి 22న కీలక ప్రకటన చేసింది. ఇండియన్ స్టూడెంట్లు తమ యూనివర్సిటీల నుంచి ఆన్‌లైన్ క్లాసుల కన్ఫర్మేషన్....

Russia-Ukraine Crisis: రష్యా.. యుక్రెయిన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఎంబస్సీ ఫిబ్రవరి 22న కీలక ప్రకటన చేసింది. ఇండియన్ స్టూడెంట్లు తమ యూనివర్సిటీల నుంచి ఆన్‌లైన్ క్లాసుల కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూడొద్దని వెంటనే తిరిగి వెళ్లిపోవాలని వెల్లడించింది.

‘మెడికల్ యూనివర్సిటీలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తాయా అనే అనుమానం వ్యక్తం చేస్తూ ఇండియన్ ఎంబస్సీకి కాల్స్ వస్తున్నాయి. గతంలో చెప్పినట్లుగానే ఇండియన్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రాసెస్‌ గురించి ఎంబస్సీ అన్నీ వ్యవహారాలను మేనేజ్ చేస్తుంది. వారి క్షేమం కోసమే వెంటనే యుక్రెయిన్ ను తాత్కాలికంగా వదిలేయాలని సూచిస్తున్నాం. యూనివర్సిటీల నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూడొద్దు’ అని వివరించింది.

Kyiv నుంచి ఇండియన్ ఎంబస్సీ ఇష్యూ చేసిన మూడో సూచన ఇది. ఫిబ్రవరి 20న.. యుక్రెయిన్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఉంటున్న భారతీయులందరూ వెళ్లిపోవడం మంచిది. ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడే ఉండటం అత్యవసరం కాదు. తాత్కాలికంగా యుక్రెయిన్ ను వదిలేయాలని సూచిస్తున్నాం’ అని అందులో పేర్కొన్నారు.

Read Also : రష్యా-యుక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ భయాలు

ఫిబ్రవరి 15న చేసిన ప్రకటనలోనూ ఇదే విషయాన్ని వెల్లడించింది ఇండియన్ ఎంబస్సీ.

మంగళవారంతో పాటు మరో రెండు రోజులు మొత్తం మూడు విమాన సర్వీసులు నడిపి భారతీయులు స్వదేశానికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది ఎయిరిండియా. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం 7గంటల 36నిమిషాలకు న్యూ ఢిల్లీ IGI ఎయిర్‌పోర్టు నుంచి తొలి సర్వీస్ బయల్దేరింది.

ట్రెండింగ్ వార్తలు