Russia-Ukraine War : ఇదేనా మానవత్వమంటే.. రాత్రిపూట జనావాసాలపై రష్యా బాంబుల దాడి.. 18 మంది దుర్మరణం..!

Russia-Ukraine War : యుక్రెయిన్ దేశాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించుకునేంతవరకు రష్యా నిద్రపోయేటట్టు లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా యుక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తోంది.

Russia-Ukraine War : యుక్రెయిన్ దేశాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించుకునేంతవరకు రష్యా నిద్రపోయేటట్టు లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా యుక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. యుక్రెయిన్ తలొగ్గేంతవరకు యుద్ధాన్ని ఆపకుండా దాడులు చేస్తూనే ఉంది. రష్యా వైమానిక దళాలు జనావాసాలపై కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఏ క్షణంలో ఏ బాంబు వచ్చి పడుతుందోనన్న భయంతో అక్కడి యుక్రెయిన్ ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని జీవిస్తున్నారు. బాంబుల మోత వినిపిస్తే చాలు.. గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. యుక్రెయిన్ జనావాసాలపై దాడులు చేయబోమని అంటూనే మరోవైపు బాంబులతో విచక్షణ లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి.

యుక్రెయిన్ స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా అక్కడి జనావాసాలపై బాంబులతో విరుచుకుపడుతున్నాయి రష్యా వైమానిక దళాలు. ఇప్పటికే రష్యా దాడుల్లో చాలామంది యుక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఆస్పత్రులు, ప్రజలు ఇళ్లు అనే తేడా లేకుండా రెసిడెన్షియల్ భవనాలపై కూడా రష్యా బలగాలు బాంబులతో దాడి చేస్తున్నాయి. జనావాసాలపైకి మిస్సైల్స్ ప్రయోగిస్తున్నాయి. తాజాగా రష్యా బలగాలు మరోసారి దారుణానికి పాల్పడ్డాయి. యుక్రెయిన్‌లో రాత్రి సమయంలో రెసిడెన్షియల్ భవనాలపై రష్యా బలగాలు దాడులకు పాల్పడ్డాయి. 500 కిలోల బాంబులతో అమాయక ప్రజల ఇళ్లపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఈ మేరకు యుక్రెయిన్‌ సాంస్కృతిక, సమాచార పాలసీ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. యుక్రెయిన్‌ విదేశాంగ శాఖ మం‍త్రి డిమెట్రో కులేబా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రష్యా వైమానిక దళాలు యుక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతాలపై రాత్రి సమయంలో దాడులకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా బలగాలు చెర్నిహివ్‌ ప్రాంతంలోని జనావాసాలపైకి 500 కిలోల బాంబుతో దాడిచేశాయని ఆయన విమర్శించారు. అదృష్టవశాత్తూ 500 కిలోల బాంబు బాంబు పేలకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు. తమ దేశాన్ని రష్యా దాడుల నుంచి కాపాడాలని ఆయన ప్రపంచ దేశాలను కోరారు.

Read Also : Russia Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపగలిగేది ప్రపంచంలో అతనొక్కడే.. పుతిన్ ఆయన మాటే వింటాడు!

ట్రెండింగ్ వార్తలు