Pladda Island for sale : అతి తక్కువ ధరకే అందాల ఐలాండ్..ఐదు బెడ్ రూముల ఇంటితో పాటు హెలిప్యాడ్ సౌకర్యాలు

ప్రకృతి ఒడిలో కొలువుతీరినట్లుండే ఒక అందాల ద్వీపం.. అందులో ఒక ఇల్లు.. పక్కనే ఒక లైట్‌ హౌస్.. చుట్టూ సముద్రం.. వాహ్ ఊహించుకోవటానికే ఎంత హాయిగా ఉందో కదా..మరి దాన్ని సొంతం చేసుకోవాలనుకునేవారికి సువర్ణ అవకాశం. అతితక్కువ ధరకే ఈ అందాల ద్వీపాన్ని సొంతం చేసుకోవచ్చు. మరి దాని ధరెంతో తెలుసా.. కేవలం మూడు కోట్లు మాత్రమే !

Pladda Island for sale : ప్రకృతి ఒడిలో కొలువుతీరినట్లుండే ఒక అందాల ద్వీపం.. అందులో ఒక ఇల్లు.. పక్కనే ఒక లైట్‌ హౌస్.. చుట్టూ సముద్రం.. వాహ్ ఊహించుకోవటానికే ఎంత హాయిగా ఉందో కదా..మరి దాన్ని సొంతం చేసుకోవాలనుకునేవారికసువర్ణ అవకాశం. అతితక్కువ ధరకే ఈ అందాల ద్వీపాన్ని సొంతం చేసుకోవచ్చు. మరి దాని ధరెంతో తెలుసా.. కేవలం మూడు కోట్లు మాత్రమే ! ఇంతకీ అదెక్కడుంది ? అంత తక్కువ ధరకు దాన్ని ఎందుకు అమ్మేస్తున్నారంటే..

ఇదే మనం చెప్పుకున్న ద్వీపం. ఫిర్త్ ఆఫ్ క్లైడ్‌లోని ఒక చిన్న స్కాటిష్ ద్వీపం ఇది. అర్రాన్ తీరంలో ఉన్న ప్లడ్డా ద్వీపంలో ఐదు పడక గదుల ఇల్లు, హెలిప్యాడ్, లైట్‌హౌస్ ఉన్నాయి. ఇది ఈనాటిది కాదు… 1790ల నాటిది. 28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. అందుకే దీన్ని తక్కువ ధరకు విక్రయించేస్తున్నారు. దాని ధర ఇండియన్ కరెన్సీలో కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే..! అంటే ఈ ధరకే ముంబై మెట్రోపాలిటన్‌ సిటీలో ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ కూడా దొరకదు. అలాంటిది ఇక్కడే ఏకంగా ఓ ద్వీపమే వచ్చేస్తోంది. ట్రాఫిక్‌ రణగొణ ధ్వనులు, పొల్యూషన్‌కు అవకాశమే ఉండదు. హాయిగా సముద్రం ఒడ్డున, లైట్‌ హౌస్‌ పక్కన కూర్చుని ప్రకృతి అందాలను హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.

ప్లాడ్డాను 30 సంవత్సరాల క్రితం అరాన్ ఎస్టేట్ ఫ్యాషన్ డిజైనర్లు డెరెక్, సాలీ మోర్టెన్‌లకు విక్రయించింది. ఇప్పుడు దాన్ని అమ్మేయాలని చూస్తున్నారు. ఇది కొనుగోలు చేసిన వారికి ఫైవ్‌ బెడ్‌ రూమ్‌ల
ఇంటితో పాటు ఒక గార్డెన్‌ కూడా వస్తుంది. అలాగే ఇంటిలో రెండు లివింగ్‌ రూమ్‌లు, కిచెన్‌, ఫర్నిచర్ కూడా ఉన్నాయి. గ్లాస్గో నుండి ఇది 31 మైళ్ల దూరంలో ఉంది. పడవ సాయంతో ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ద్వీపంలో 100 కంటే ఎక్కువ జాతుల పక్షులు ఉన్నాయి. ఇక లైట్‌ హౌస్‌లో లైట్‌కి ప్రత్యేకంగా కరెంట్‌ అవసరం లేదు. ఇది సౌరశక్తిని వినియోగించుకుంటుంది. ఇలా ఆ చుట్టుపక్కల చిన్న చిన్న ద్వీపాల్లో నిర్మించిన ఇల్లలో ఎవరూ ఉండడం లేదు. దీంతో అవి పాడైపోతున్నాయి. అందుకే ఎంత తక్కువకు వీలైతే.. అంత తక్కువకు వాటిని అమ్మేస్తున్నారు. ఎంత తక్కువ ధర పెట్టినా కొన్నేవాళ్లే కరువయ్యారు. ఎందుకంటే మనిషి జాడే కనిపించిన ఐలాండ్లో పర్మినెంట్‌గా ఉండేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు.

కాకపోతే ఏకాంతం కోరుకునే వాళ్లు..! అక్కడ పర్మినెంట్‌గా ఉండిపోకుండా.. ఎప్పుడైనా ఏకాంతంగా ఉండాలని అనుకున్నప్పుడు ఐలాండ్‌కి వెళ్దాం అనుకునే వాళ్లు.. దాన్ని కొనేందుకు ఆసక్తి చూపించొచ్చు. అంతేకానీ పర్మినెంట్‌గా మాత్రం ఎవరూ ఉండకపోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు