China-Constructed Enclave : అదిగో.. అరుణాచల్‌లో చైనా రెండో గ్రామం.. శాటిలైట్ ఫొటోలే సాక్ష్యం..!

జిత్తులమారి చైనా బుద్ధి మారలేదు. భారత్ సరిహద్దుల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గ్రామాలను చైనా కట్టేస్తోంది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అక్ర‌మంగా చైనా నిర్మించిన రెండ‌వ గ్రామం ఇదే.

Second China-Constructed Enclave : జిత్తులమారి చైనా బుద్ధి మారలేదు. భారత్ సరిహద్దుల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గ్రామాలను చైనా కట్టేస్తోంది. మొన్న ఒక 100ఇళ్లతో ఒక గ్రామాన్ని డ్రాగన్ నిర్మించిందని వార్తలు రాగా.. ఇప్పుడు ఏకంగా రెండో గ్రామం నిర్మిస్తోందట.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అక్ర‌మంగా చైనా నిర్మించిన రెండ‌వ గ్రామానికి సంబంధించిన లేటెస్ట్ శాటిలైట్ ఫొటోలు రిలీజ్ అయ్యాయి. ఓ జాతీయ మీడియా ఆ చైనా రెండో గ్రామం శాటిలైట్ ఫొటోలను విడుదల చేసింది. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 బిల్డింగ్‌ల‌ను నిర్మించిన‌ట్లు శాటిలైట్ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

చైనా నిర్మించిన ఈ గ్రామం (ఎన్‌క్లేవ్) 2019 నాటి శాటిలైల్ దృశ్యాల్లో ఎక్కడా లేదు. సరిగ్గా ఏడాది తర్వాత ఈ గ్రామం ఉన్నట్టు గుర్తించారు. ఇటీవలే అరుణాచల్ లో చైనా ఒక గ్రామాన్ని నిర్మించింది. ఇప్పుడా ఆ గ్రామానికి సరిగ్గా 93 కిలోమీటర్ల దూరంలో తూర్పువైపున ఈ కొత్త గ్రామాన్ని చైనా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. చైనా దశాబ్దాలుగా అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలతో సహా సరిహద్దు ప్రాంతాలలో గత కొన్నేళ్లుగా నిర్మాణ కార్యకలాపాలను చేపట్టింది. చైనా నిర్మించిన రెండో గ్రామం.. లైన్ ఆఫ్ అక్చువల్ కంట్రోల్ (LAC)కు ఇంటర్నేషనల్ బోర్డర్ మధ్య ఉన్న భారత భూభాగంలో ఉన్నట్టు భావిస్తున్నారు.

ఈ ప్రాంతం తమదేనని గతంలోనే భారత్ స్పష్టం చేసింది. కొత్త‌గా నిర్మించిన ఆ బిల్డింగ్‌ల్లో ఎవ‌రైనా ఉన్నారా లేదా అన్న విష‌యం స్ప‌ష్టంగా తెలియడం లేదు. భార‌తీయ ఆర్మీ దీనిపై స్పందించింది .. కొత్త నిర్మాణం (LAC)కి ఉత్త‌రం వైపున ఉన్న‌ట్లు పేర్కొంది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని షియోమి జిల్లాలోని భూభాగంలో ఈ ప్రాంతం ఉందని అంటున్నారు.
Read Also : Paytm CEO : నెలకు రూ.10వేల జీతమని.. నాకు పిల్లను ఇవ్వనన్నారు : విజయ్ శేఖర్ శర్మ

ట్రెండింగ్ వార్తలు