దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టాలని బీజేపీ కుట్ర చేస్తుంది : వి. హన్మంతరావు

భారత దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టాలని బీజేపీ కుట్ర చేస్తుందని మాజీ ఎంపీ వి. హనుమంతరావు విమర్శించారు.

V Hanumantha Rao

V Hanumantha Rao : భారత దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టాలని బీజేపీ కుట్ర చేస్తుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. శనివారం గాంధీభవన్ లో మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. మోదీ, అమిత్ షాలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోదీ ప్రజలను మోసం చేశారు. మోదీ హటావ్ దేశ్ బచావ్ అని దేశ ప్రజలు అంటున్నారని వీహెచ్ పేర్కొన్నారు. మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఈసారి దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాహుల్ ప్రధాని అవుతారని వి. హనుమంతరావు దీమా వ్యక్తం చేశారు.

Also Read : రేవంత్ రెడ్డితో నా ప్రాణానికి హాని: మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీ కుల గణన ఎందుకు చేయలేదని వీహెచ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ కుల గణన చేస్తానని అన్నారు. మోదీ మీటింగ్ లకు ప్రజలు టికెట్లు కొని వస్తున్నారని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.. మోదీ ఏమైనా అమితాబచ్చనా? అంటూ వీహెచ్ ఎద్దేవా చేశారు. మణిపూర్ లో మహిళలను హింసించి చంపినా కూడా మోదీ వెళ్లలేదు. అదాని, అంబానీకి 16లక్షల కోట్ల రుణమాఫీ చేశాడు. పేదలకు, రైతులకు రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ 70వేల కోట్ల రుణమాఫీ చేసిందని వీహెచ్ అన్నారు.

Also Read : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై జరుగుతున్న విషప్రచారం నమ్మొద్దు : పోసాని కృష్ణమురళి

కేసీఆర్.. త్రిబుల్ తలాక్, ఆర్టికల్ 370కి మద్దతిచ్చాడు. కేసీఆర్ పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయలేదు. అప్పుల కుప్పలు, లక్షల కోట్ల అవినీతి చేసిండు. బీజేపీ, బీఆర్ఎస్ ల చీకటి ఒప్పందం బయటపడింది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుంది. నేను సచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటా. కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తానని వి. హన్మంతరావు చెప్పారు.