ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై జరుగుతున్న విషప్రచారం నమ్మొద్దు : పోసాని కృష్ణమురళి

చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్ని పథకాలు తీసేస్తాడు. ఒక్కపైసా కూడా పేదలకు రానివ్వడు. ప్రజలంతా ఒక్కసారి ఇంట్లో కూర్చొని ఆలోచించండి.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై జరుగుతున్న విషప్రచారం నమ్మొద్దు : పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali

Updated On : May 11, 2024 / 11:59 AM IST

Posani Krishna Murali : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పేదలకు భూములు ఇచ్చేవ్యక్తే కానీ, పేదల భూములు లాక్కొనే వ్యక్తి కాదని పోసాని అన్నారు. జగన్ పేదల భూములు లాక్కుంటే నేను విజయవాడ వచ్చి బలవన్మరణానికి పాల్పడతా. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద జరుగుతున్న విషప్రచారం నమ్మొద్దని పోసాని ఏపీ ప్రజలను కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి మీకు జరుగుతున్న మంచిని చూడండి. చంద్రబాబు నాయుడును మళ్లీమళ్లీ నమ్మి మోసపోకండి. అధికారంకోసం ఏ పనైనా చేయడానికి చంద్రబాబు రెడీగా ఉంటారు. ఎవరి కాళ్లు పట్టుకోవడానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉంటారంటూ పోసాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Also Read : మన ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర- కడపలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

జగన్ మోహన్ రెడ్డిని తిట్టాలని చంద్రబాబు పిలుపు ఇవ్వగానే హైదరాబాద్ నుండి ఒక పచ్చ బ్యాచ్ దిగుతుంది. ఒక్కరోజు కూడా ఏపీలో లేనివారు ఇవాళ ఏపీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న పచ్చ బ్యాచ్ కరోనా సమయంలో ఎవరైనా వచ్చారా? సహాయం చేస్తారని చూశా.. ఎవరూ రాలేదు. కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాద్ మదీనాగూడలో వందల ఎకరాల ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఏపీ నుంచి ఎవరైనా ఫోన్ చేసిన ఎత్తలేదు. కరోనా సమయంలో కనీసం పవన్ కల్యాణ్ వస్తారేమోనని ప్రజలు ఎదురు చూశారు. మరి కరోనా సమయంలో కాపులకు పవన్ సహాయం చేశారా?. కరోనా సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ఏపీలో నిలబడి ప్రజలకు నిజాయితీగా సేవలు అందించారని పోసాని అన్నారు.

Also Read : దురదృష్టం అంటే ఇదే..! వ్యాన్‌లో సున్నం బస్తాల మధ్య భారీగా నోట్ల కట్టలు.. ఎలా గుర్తించారంటే?

చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్ని పథకాలు తీసేస్తారు. ఒక్కపైసా కూడా పేదలకు రానివ్వరు. ప్రజలంతా ఒక్కసారి ఇంట్లో కూర్చొని ఆలోచించండి. ఓటు వేసే ముందు ఆలోచించండి. ప్రాణం ఉన్నంత వరకు పేదల ప్రాణాలకు అండగా నిలిచే జగన్ కు మీరు అండగా ఉండండి అంటూ పోసాని కృష్ణ మురళి ఏపీ ప్రజలను కోరారు.