దురదృష్టం అంటే ఇదే..! వ్యాన్‌లో సున్నం బస్తాల మధ్య భారీగా నోట్ల కట్టలు.. ఎలా గుర్తించారంటే?

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో ఎర్ర కాలువ బ్రిడ్జి వద్ద వ్యాన్, లారీ ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది.

దురదృష్టం అంటే ఇదే..! వ్యాన్‌లో సున్నం బస్తాల మధ్య భారీగా నోట్ల కట్టలు.. ఎలా గుర్తించారంటే?

Huge Money Seized

Updated On : May 11, 2024 / 11:27 AM IST

AP Election 2024 : ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మరో రెండు రోజులే గడువు ఉంది. భారీ మొత్తం డబ్బు చేతులు మారుతోంది. ఈ క్రమంలో చెక్ పోస్టుల వద్ద వాహనాలను భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పలు వాహనాల్లో పెద్ద మొత్తంలో తరలిస్తున్న నగదును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వ్యాన్ లో సున్నం బస్తాల మధ్యలో నోట్ల కట్టలను ఉంచి తరలిస్తున్నారు. అనుకోని ప్రమాదం చోటు చేసుకోవటంతో అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టల గుట్టు రట్టయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

Also Read : AP Election 2024 : ఓటు వేసేందుకు సొంతూళ్లకు.. హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై భారీగా వాహనాల రద్దీ

ఏలూరు జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో ఎర్ర కాలువ బ్రిడ్జి వద్ద వ్యాన్, లారీ ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. ఈ వ్యాన్ లో సున్నం మూటలను తరలిస్తున్నారు. వ్యాన్ బోల్తా పడటంతో సున్నం మూటల మధ్య బాక్సుల్లో భద్రపర్చిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకిదిగి విచారణ జరుపుతున్నారు.

Also Read : మన ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర- కడపలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

బ్లూ కలర్ ప్యాకింగ్ చేసిన ఏడు బాక్సుల్లో నగదును కట్టలుగా భద్రపర్చారు. వీటిని సున్నం బస్తాల మధ్యలో ఉంచారు. నగదు మొత్తాన్ని వీరవల్లి టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో అధికారులు లెక్కిస్తున్నారు. నల్లజర్ల సీఐ దుర్గా ప్రసాద్, ఫ్లయింగ్ స్వ్కాడ్ ఆధ్వర్యంలో నగదు కౌంటింగ్ కొనసాగుతుంది. పట్టుబడి నగదు మొత్తం 7కోట్లుపైనే ఉండొచ్చని తెలుస్తోంది. ఇంకా నగదును సిబ్బంది లెక్కిస్తున్నారు. అయితే, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి వెళ్తుంది? అనే విషయాలపై పూర్తి విచారణ చేస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ కు గాయాలు కావడంతో ఆయన్ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి, మండపేట ప్రాంతాలకు డబ్బును తరలిస్తున్నట్లుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై పూర్తి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.