Pawan Kalyan: ప్లాప్ డైరెక్టర్ కి మాటిచ్చిన పవన్.. సినిమా చేయాల్సిందేనా.. ఈ టైంలో అవసరమా అంటున్న ఫ్యాన్స్
గతంలో హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా ప్లాన్ చేస్తున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
Pawan Kalyan is doing another film with Vakeel Saab fame Venu Sriram.
- వకీల్ సాబ్ కాంబో రిపీట్
- వేణు శ్రీరామ్ కు గతంలోనే మాటిచ్చిన పవన్
- మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు చేసిన పవన్.. సుజీత్, సురేందర్ రెడ్డితో సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో క్రేజీ ప్రాజెక్టు యాడ్ అయినట్టుగా తెలుస్తోంది. గతంలో పవన్‌తో ‘వకీల్ సాబ్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్, మళ్ళీ పవన్‌తో రెండో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడట. వకీల్ సాబ్ టైంలోనే పవన్ ఆయనకు ఒక సినిమా చేస్తానని మాట ఇవ్వడంతో, ఇప్పుడు ఆ అవకాశాన్ని వేణు శ్రీరామ్ పక్కాగా వినియోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
Oscar 2026: అట్టహాసంగా మొదలైన ఆస్కార్ అవార్డుల వేడుక.. విజేతలు వీళ్ళే
ఇప్పటికే పవన్(Pawan Kalyan)ను కలిసి ఒక పవర్ఫుల్ లైన్ వినిపించగా, అది పవన్‌కు బాగా నచ్చిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ వార్త బయటకు రావడంతో పవన్ అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దానికి ప్రధాన కారణం వేణు శ్రీరామ్ గత చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవడమే. కాబట్టి, ఇలాంటి సమయంలో పవన్ లాంటి టాప్ స్టార్‌తో సినిమా చేయడం వల్ల తన కెరీర్‌కు మళ్ళీ బూస్ట్ వస్తుందని వేణు శ్రీరామ్ భావిస్తున్నారు.
కానీ, సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుజిత్, హరీష్ శంకర్ వంటి మాస్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న తరుణంలో, మళ్ళీ వేణు శ్రీరామ్‌తో ప్రాజెక్ట్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, వేణు శ్రీరామ్ మాత్రం తాను పవన్ తో చేయబోయే ప్రాజెక్టు పట్ల ధీమాగా ఉన్నాడట. ‘వకీల్ సాబ్’ రీమేక్ అయినప్పటికీ అందులో పవన్‌ను ఆయన ఎలివేట్ చేసిన తీరు బాగుండటంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ విషయంలో కూడా ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే, పవన్ ప్రస్తుతం కమిట్ అయిన చిత్రాల షూటింగ్స్ పూర్తయిన తర్వాతే ఇది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మరి ఫ్యాన్స్ వ్యతిరేకతను పక్కన పెట్టి పవన్ ఈ సినిమాను పట్టాలెక్కిస్తారో లేదో చూడాలి.
