గన్ పట్టుకుని నడిరోడ్డుపై అమ్మాయి డ్యాన్స్.. వీడియో వైరల్

Viral Video: లక్నో పోలీసులు కూడా దీనిపై స్పందించారు. ఆ అమ్మాయిపై..

Viral Video

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీసుకోవడం చాలా మందికి డైలీ రొటీన్‌గా మారిపోయింది. డ్యాన్సులు, మోడలింగ్, వింత వింత ప్రయోగాలు చేస్తూ వీడియోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వీడియోలు తీసుకుంటూ చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు చాలా మంది.

ఇటువంటి ఘటనే తాజాగా మరొకటి చోటుచేసుకుంది. ప్రముఖ యూట్యూబర్ సిమ్రాన్ యాదవ్ తన చేతుల్లో గన్ పట్టుకుని రోడ్డు మధ్యలో నిలబడి డ్యాన్స్ చేసింది. లక్నోలోని హైవేపై ఈ వీడియోను తీసుకున్నట్లు తెలుస్తోంది.

నడిరోడ్డుపై ఆమె గన్ పట్టుకుని ప్రదర్శించిన తీరుపై సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్నో పోలీసులు కూడా దీనిపై స్పందించారు. ఆ అమ్మాయిపై వెంటనే చర్యలు తీసుకున్నారు. అడ్వకేట్ కల్యాణ్‌జీ చౌదరి ఎక్స్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

భోజ్‌పురి పాటకు సిమ్రాన్ డ్యాన్స్ చేసిందని వివరించారు. అంత ధైర్యంగా నడిరోడ్డుపై ఆమె చేతుల్లో తుపాకీని చూపుతూ ఈ వీడియో తీసుకుందని చెప్పారు. దీనిపై అధికారులు మౌనం వహించడం ఎందుకంటూ ఆఫీసర్లను ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ చేశారు. సిమ్రాన్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సిమ్రాన్ యాదవ్ కు సామాజిక మాధ్యమాల్లో లక్షల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు.

Also Read: ఓరి వీళ్ల దుంపతెగ.. క్రికెట్ ఆడుతున్నారా? చేపలు పడుతున్నారా! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు