1984 Spider Man Comic : స్పైడర్ మ్యాన్ పుస్తకంలో ఒకే ఒక్క పేజీ ధర రూ.24 కోట్లు..!!

స్పైడర్ మ్యాన్ పుస్తకంలో ఒక్కపేజీ రూ.24 కోట్లకు అమ్ముడైంది.స్పైడర్ మ్యాన్ పేరొక్కటే చాలు అన్నట్లుగా ఆ పుస్తకంలో ఒకేఒక్క పేజీ కోట్లకు అమ్ముడైంది అంటే దాని క్రేజ్ ఏంటో ఊహించుకోవచ్చు.

1984 Spider Man Comic Single Page Rs 24 Crore : 40 ఏళ్లనాటి ఓ చిన్న కేక ముక్క అక్షరాలా రూ.30 లక్షలకుపైనే అమ్ముడైంది. ఓ ప్రముఖుడు ముక్కు నోరు తుడుచుకున్న ఓ టిష్యూ పేపర్ ఏకంగా ఏకంగా రూ.705 కోట్లకు అమ్ముడైతే నోరెళ్లబెట్టాం. అలా ప్రముఖులు, సెలబ్రిటీలు వాడిన వస్తువులు వేలంలో షాకింగ్ ధరకు అమ్ముడవుతుంటాయి. కొంతమంది తమకు ఇష్టమైన వ్యక్తుల వస్తువుల్ని సొంతం చేసుకోవాలని కోట్ల రూపాలు పెట్టి మరీ కొంటుంటారు. అది వారి అభిమానం. అలాగే కొన్ని పుస్తకాలు కూడా భారీ ధరకు అమ్ముడైన విషయం తెలిసిందే.

కానీ ఓ పుస్తకంలో ఓకే ఒక్క పేజీ కోట్ల రూపాయలు అమ్ముడైన విషయం గురించి విన్నారా? మరొక్కసారి క్లారిటీ కోసం..‘‘ అది పుస్తకం కాదు పుస్తకంలో ఓకే ఒక్క పేజీ మాత్రమే కోట్టరూపాయలకు అమ్ముడైంది. పుస్తకంలో ఒక్క పేజీ ఏకంగా రూ.24 కోట్లకు వేలంలో అమ్ముడైంది. ఏంటీ షాకింగ్ గా ఉంది కదూ..ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పుస్తకాలు భారీ ధరకు అమ్ముడవుతుంటాయి. కానీ ఓ పుస్తకంలో ఒకే ఒక్క పేజీ అమ్ముడు కావటం అదికూడా కోట్ల రూపాయల ధర పలకటం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని వేరే చెప్పనక్కరలేదు…ఏంటా పుస్తకం?ఆ పేజీకి ఎందుకంత డిమాండో తెలుసుకుందాం..

Also Read : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అది 1984 నాటి పుస్తకం. సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పుస్తకం. ఆ పుస్తకంలో ఓ పేజీ వేలంలో ఏకంగా రూ. 24 కోట్లకు అమ్ముడుపోయింది..! స్పైడర్ మ్యాన్ 1962 నాటి ప్రచురణ అప్పట్లో పెను సంచలనం క్రియేట్ చేసింది. స్పైడర్ మ్యాన్ అనేది కామిక్ పుస్తక చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరోల పాత్రలో ఒకటి. ఈనాటికి స్పైడర్ మ్యాన్ అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో క్రేజ్ క్రియేట్ చేసిన పాత్రగా కొనసాగుతునే ఉంది.

Also Read : Rare whiskey : ఈ విస్కీ బాటిల్ ధర రూ 4.14 కోట్లు..‌!

కామిక్ పుస్తకాల సుప్రసిద్ధ రచయితలైన స్టాన్ లీ, స్టీవ్ డిట్కోచే సృష్టించబడిన ఈ పాత్ర దశాబ్దాలుగా ఆదరణ పొందుతునే ఉంది. ఈ పేరు మీద ఏ సినిమా వచ్చిన హిట్లే. స్టాన్ లీ, స్టీవ్ డిట్కోచే సృష్టించబడిన ఈ పాత్రకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఈ పేరుతో సినిమాలు ఎన్ని సీక్వెల్స్ వచ్చినా హిట్ అయ్యాయి. అంతేకాదు వెబ్‌సీరీస్‌, యానిమేటెడ్‌ చిత్రాల వరకు ఈ స్పైడరమేన్‌ పాత్ర అలరిస్తునే ఉంది.

Also Read : Lionel Messi: ముక్కు,మూతి తుడుచుకున్న టిష్యూ పేపర్‌ ధర రూ. 7.5 కోట్లు

ఇటీవల డిసెంబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో ‘స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్’ అనే సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇన్ని దశాబ్దాలు దాటిని ఆ పాత్రకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతునే ఉంది. దటీజ్ స్పైడర్ మ్యాన్అనేలా. అంతేగాదు కోవిడ్-19 ఆంక్షల మధ్య కూడా అభిమానులు టిక్కెట్లు కొనుక్కొని థియేటర్లలోనే సినిమా చూడటానికి ఎంతో ఆసక్తి చూపెట్టారు. ఈ స్వీక్వెల్ మూవీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

Also Read : picasso paintings : రూ. 817 కోట్ల ధర పలికిన పికాసో పెయింటింగ్స్..

స్పైడర్ మ్యాన్ పేరొక్కటే చాలు. అది సినిమా అయినా,సిరీస్ అయినా..ఆఖరికి అది పుస్తకమైనా పుస్తకంలో ఓ పేజీ అయినా సరే అనేలా 1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పుస్తకంలోని 25వ పేజీ వేలంలో ఇంత ధర పలకడం ఆ పాత్రకు ఉన్న క్రేజ్ ను చాటి చెబుతోంది. నిజమే కదా..దటీజ్ ‘స్పైడర్ మ్యాన్’.

 

ట్రెండింగ్ వార్తలు