Hiv in Omicron : ఒమిక్రాన్ మూలాల్లో HIV..ఆ దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఎయిడ్స్..

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ మూలాల్లో హెచ్‌ఐవీ ఉందనే విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు.

Hiv in Omicron variant sources : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ మూలాల్లో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఎయిడ్స్( Human immunodeficiency virus) ఉందని నిర్ధారణకు వచ్చారు నిపుణులు. దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్‌ మూలాల్లో హెచ్‌ఐవీ ఉందని ఒక ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. జెట్ స్పీడ్ తో ప్రపంచాన్ని చుట్టేసిన ఒమిక్రాన్ వేరియంట్ గుబులు అన్ని దేశాల్లోను పెరిగింది. దీంతో ఆందోళన పెరుగుతోంది.

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందికి కూడా ఈ ఒమిక్రాన్ వ్యాపించింది. దీంతో ఈ కొత్త వేరియంట్ ఇంత శక్తి ఎలా వచ్చింది? అది ఎందుకంతే వేగంగా వ్యాపిస్తోంది? కోవిడ్ బలహీనపడింది అనుకునే సమయంలో ఒక్కసారిగా ఒమిక్రాన్ వేరియంట్ గా ఎలా రూపాంతరం చెందింది? దీనికి గల కారణాలు ఏంటి?అనే ప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలకు పెను సవాలుగా మారింది. అనుమానం వచ్చింది అంటే దాన్ని అంతు ఏంటో తేల్చుకునేవరకు ఏ శాస్త్రవేత్త నిద్రపోరు. దీంతో ఈ దీనికి సమాధానాలు కనుగొనేందుకు దీనికి కూడా చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? అనే కోణాల్లో పరిశోధనలు చేపట్టిన దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్‌ మూలాల్లో హెచ్‌ఐవీ ఉందనే ఓ కొత్త విషయం తెలిసింది. అదే ‘ఒమిక్రాన్’ మూలాల్లో ఎయిడ్స్ ఉందనే విషయం.

Read more : Dr.Anfelique coetzee : సాధారణ చికిత్సతోనే ఒమిక్రాన్ నుంచి బయటపడొచ్చు : డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ

ఐరాస దేశాల హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ సంయుక్త నియంత్రణ కార్యక్రమం ‘యూఎన్‌ఎయిడ్స్‌’ గత ఏడాది ఓ నివేదిక ఇచ్చింది. దక్షిణాఫ్రికాలో 18-45 ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్‌ఐవీకి గురయ్యారని..ప్రపంచ హెచ్‌ఐవీ కేంద్రంగా దక్షిణాఫ్రియా మారిందని ఈ నివేదిక పేర్కొంది. ఈ వైరస్‌ సోకినవారిలో 30% పైగా మంది అసలు యాంటీరిట్రోవైరల్‌ డ్రగ్స్‌ని తీసుకోవడమే లేదని తేల్చింది. హెచ్‌ఐవీ సోకినా ఎటువంటి మెడిసిన్స్ వాడనివారి రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనపడిజజఇతరత్రా వ్యాధులకు నిలయంగా మారుతుంది.

Read more : Omicron : ఒమిక్రాన్ వేరియంట్ ని మొద‌ట‌గా గుర్తించి మహిళా డాక్టర్ ఎవరో తెలుసా?

అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఓ మహిళ కరోనా బారిన పడింది. ఆమె శరీరంలోని హెచ్‌ఐవీ వైరస్‌ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి ఉంటుందని దక్షిణాఫ్రికా పరిశోధకులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన డా.కెంప్‌ బృందం కూడా సరిగ్గా ఇటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు.

Read more : Scrub Typhus In HYD : హైదరాబాద్ లో వింత వ్యాధి..ఇళ్లల్లో ఉండే పురుగు వల్ల సోకుతున్న వ్యాధి

దీనిపై డా.కెంప్‌ మాట్లాడుతు..‘‘హెచ్‌ఐవీ వైరస్‌ ఉన్న శరీరంలో కరోనా విజృంభించడానికి చాలా అనుకూలమైన పరిస్థితులుంటాయని..దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉంటారు కాబట్టి..అక్కడే కరోనాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌గా అవతరించి ఉండొచ్చు’’ అని వివరించారు.

ట్రెండింగ్ వార్తలు