Guinness Record : 46 కీళ్లు విరుచుకుని వరల్డ్ రికార్డ్.. ఈ కుర్రాడు మామూలోడు కాదు

కాదేది కవితకనర్హం లాగ.. కాదేది రికార్డులకి అనర్హం అన్నట్లు ఉంది. 6 ఏళ్ల వయసప్పటి నుంచి మెటికలు విరవడం ప్రారంభించి ఇప్పుడు అదే పనితో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు ఓ కుర్రాడు.

Guinness World Records : చాలామందిలో చేతి వేళ్లు మెటికలు విరిచే అలవాటు ఉంటుంది. కొందరు అదే పనిగా మెటికలు విరుస్తుంటారు. అలా చేయడం హానికరమని కూడా చెబుతారు. అయితే 46 కీళ్లను ఒకేసారి విరవడం (crack) అంటే.. అమ్మో.. ఉన్నాయా? విరిగిపోయాయా? అని అనుమానం వస్తుంది. అయితే స్వీడన్ కి చెందిన ఓ కుర్రాడు 46 కీళ్లను విరిచి వరల్డ్ రికార్డు బద్దలు కొట్టడమే కాదు.. పాత రికార్డును తిరగరాశాడు.

Saree Walkathon : సూరత్ లో 15000 మంది మహిళల “శారీ వాకథాన్”..భారత్‌లో అతి పెద్ద రికార్డ్

స్వీడన్‌కు (Sweden) చెందిన 23 ఏళ్ల ఒల్లె లుండిన్ అనే వ్యక్తి (Olle Lundin) వరుసగా 46 కీళ్లను పగులగొట్టాడు, గతంలో అంటే 2022లో 40 కీళ్లను పగులగొట్టిన నేపాల్‌కి (nepal) చెందిన కమల్ పోఖ్రెల్ (Kamal Pokhrel ) రికార్డ్‌ను తిరగరాసాడు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ (Guinness World Records) యాజమాన్యం ధృవీకరించింది. ఈ రికార్డ్ నెలకొల్పడం కోసం లుండిన్ ఎంతో శ్రమ పడ్డాడట. రికార్డ్ టైంలో ప్రతి క్రాక్ కి మధ్య మూడు సెకండ్లు మాత్రం టైం ఉంటుందట.. గిన్నిస్ వారి రూల్స్ ప్రకారం మొదటిసారి పగలకపోతే వెంటనే రెండో దానికి ఛాలెంజర్ వెళ్లిపోవాలి. 6 సంవత్సరాల వయసు నుంచి లుండిన్ మెటికలు విరుస్తూ చేసిన ప్రాక్టీస్ మొత్తానికి అతిడిని ప్రపంచ రికార్డు (world record) నెలకొల్పేలా చేసింది.

Guinness Record : 4 ఏళ్లకే గిన్నిస్ రికార్డ్.. ఆ బుడతడు చేసిన పనికి ఆశ్చర్యపోతారు..

మనం వేళ్లు విరుస్తున్నప్పుడు ఎముకల మధ్య వచ్చే గ్యాప్ దగ్గర సినోవియల్ లిక్విడ్ (synovial fluid) అనే గ్యాస్ బుడగ తయారవుతుంది. వేళ్లడం విరవడం వల్ల ఆ బుడగ పేలి శబ్దం వస్తుంది. దాంతో మనం ఎముక విరిగిందని అనుకుంటాం. ఇక అదే పనిగా ఇలా మెటికలు విరుస్తూ ఉండటం వల్ల ఎముకలు దెబ్బతింటాయని.. అది ఆర్ధరైటిస్ కి దారి తీస్తుందని నిపుణులు చాలాసార్లు సూచించారు. కానీ ఈ ప్రాక్టీస్ వల్లనే లుండిన్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టాడు. ఈ కుర్రాడికి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు