Burqas Baned : బుర్ఖా వేసుకుంటే భారీ జరిమానా .. కొత్త చట్టం తెచ్చిన దేశం

బురఖా ధరిస్తే భారీ జరిమానా విధించేలా ఆ దేశం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇక నుంచి దేశ వ్యాప్తంగా బురఖా ధరిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Burqas Baned In Switzerland

Burqas Baned In Switzerland : ముస్లిం మహిళలకు బురఖా అనేది సర్వసాధారణం. అది వారి సంప్రదాయం. ఈ బురఖా విషయంలో ఎన్నో వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. హిజాబ్ అనే అంశం భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో ఎంత వివాదమైందో తెలిసిందే. ఈక్రమంలో బురఖాపై స్విట్జర్లాండ్ ( Switzerland)పార్లమెంట్ (parliament)కీలక నిర్ణయం తీసుకుంది. బురఖాను నిషేధిస్తు తెచ్చిన బిల్లుకు ఆమోదం పలికింది. ఈ బిల్లు ప్రకారం స్విట్జర్లాండ్ లో బురఖా ధరిస్తే భారీ జరిమానా తప్పదు.

స్విట్జర్లాండ్ పార్లమెంట్ దిగువ సభ నేషనల్ కౌన్సిల్ బురఖాలను నిషేధించే బిల్లుకు బుధవారం (సెప్టెంబర్ 20,2023) ఆమోదం పలికింది. ఈ బిల్లుకు ఇప్పటికే ఎగువ సభ ఆమోదించిన ఈ చట్టాన్ని రైట్ వింగ్- పాపులిస్ట్ స్విస్ పీపుల్స్ పార్టీ (populist Swiss People’s Party) సమర్థించింది. 151-29 ఓట్ల తేడాతో నేషనల్ కౌన్సిల్ ఈ బిల్లుకు తుది ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు ఎగువ సభ కూడా ఆమోదం చెప్పినందున ఇక చట్ట రూపం దాల్చిందనే చెప్పొచ్చు. చట్టం రూపం అనేది ఒక నామమాత్రమే.

Chennai : క్యాబ్‌ డ్రైవర్‌ అకౌంట్లోకి రూ.9వేల కోట్లు .. షాక్ నుంచి కోలుకునే లోపే మరో షాక్..!

బురఖా నిషేధంపై స్విట్జర్లాండ్ దేశ వ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని స్వీకరించింది. దేశ వ్యాప్తంగా ప్రజలు బురఖా ధరించటానికి వ్యతిరేకంగానే ఓటు వేశారు. అనంతరమే దీనిపై బిల్లు తీసుకురావటం ఆమోదం తెలపటం జరిగింది. బిల్లుకు రెండు సభలు ఆమోదం పలకటంతో ఇక ఇది చట్టం రూపం దాల్చనుంది. ఈ చట్టం ప్రకారం ఇక బురఖా ధరిస్తే భారీ జరిమానాలే విధించనున్నారు. చట్టం ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించనున్నారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే 1,000 స్విస్ ఫ్రాంక్ లను జరిమానాగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే 1,100 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.91,300 జరిమానా చెల్లించుకోవాలి.

ఈ నిబంధన దేశ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలతో పాటు ప్రజలు వినియోగించుకునే ప్రైవేటు ప్రదేశాల్లో కూడా బురఖా ధరించకూడదు. ముక్కు, నోరు, కళ్లను కప్పి వేయకూడదని ఈ కొత్త చట్టం చెబుతోంది. కాగా.. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా బురఖా నిషేధించాలనే ప్రచారం ముస్లిం వర్గాల నుంచి విమర్శలు వెల్లడయ్యాయి. పర్పుల్ హెడ్‌స్కార్వ్స్ అనే ముస్లిం మహిళా గ్రూపు ప్రతినిధి ఇనెస్ ఎల్-షిఖ్ AFP వార్తా సంస్థతో మాట్లాడుతూ.. “స్విట్జర్లాండ్‌లో బురఖాలు ధరించిన మహిళలు కేవలం 30 మంది మాత్రమే ఉన్నారు.” అని అన్నారు.

Canada : కెనడాలోమరో సంచలన హత్య .. ఖలిస్థాన్ ఉగ్రవాది సఖ్‌దూల్‌ సింగ్‌ హతం

కాగా..స్విట్జర్లాండ్‌లోని కొంతమంది మహిళలు బురఖాల వంటి పూర్తి ముఖ కవచాలను ధరిస్తారు. వీటిని ఆఫ్ఘనిస్తాన్‌లో గార్బ్ అని పిలుస్తారు. రెండు స్విస్ ఖండాలు దక్షిణ టిసినో, ఉత్తర సెయింట్ గాలెన్ ఇప్పటికే ఇలాంటి చట్టాలను కలిగి ఉన్నాయి. జాతీయ చట్టం స్విట్జర్లాండ్‌ను ఇలాంటి చర్యలను అమలు చేసిన బెల్జియం,ఫ్రాన్స్ వంటి దేశాలకు అనుగుణంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు