Chennai : క్యాబ్‌ డ్రైవర్‌ అకౌంట్లోకి రూ.9వేల కోట్లు .. షాక్ నుంచి కోలుకునే లోపే మరో షాక్..!

ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఎకౌంట్ ఏకంగా రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. ఆ షాక్ నుంచి కోలుకునేలోపే మరో షాక్..ఆ షాకులకు అతను దిమ్మ తిరిగిపోయింది.

Chennai cab driver  bank account Rs.9000 crores

Chennai cab driver  bank account Rs.9000 crores : తమిళనాడు(Tamil Nadu)లోని చెన్నై(Chennai)కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ (cab driver)బ్యాంక్ ఎకౌంట్ (bank account)లోకి ఒకటీ రెండు కాదు ఏకంగా రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. దానికి సంబంధించి సదరు క్యాబ్ డ్రైవర్ కు మెసెజ్ వచ్చింది. అది చూసి అతను దిమ్మ తిరిగిపోయింది. పొరపాటున మెసేజ్ వచ్చిందేమో అనుకున్నాడు. ఏకంగా రూ.9,000 కోట్లకు ఉన్న సున్నాల్ని లెక్కించేందుకు కూడా తడబడ్డాడు. కానీ అది నిజమో కాదో అని తేల్చుకోవటానికి తన స్నేహితుడికి రూ.21,000లు ట్రాన్స్ ఫర్ చేశాడు. నిజమేనని నిర్ధారించుకుని తెగ ఆశ్చర్యపోయాడు. కంగారుపడిపోయాడు బాబోయ్ అన్ని డబ్బులు తన ఎకౌంట్ లోనే అనుకుని ఒక రకమైన భావనకు గురయ్యాడు. కానీ ఇంతలోనే బ్యాంక్ వాళ్లు సదరు క్యాబ్ డ్రైవర్ కు షాకిచ్చారు..

పళని (Palani) సమీపంలోని నైక్కరిపట్టి గ్రామానికి (Neikkarapatti village) చెందిన రాజ్‌కుమార్‌ (Rajkumar)అనే వ్యక్తి క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తోటి క్యాబ్‌ డ్రైవర్లతో కలిసి కోడంబాక్కంలో గదిని అద్దెకు తీసుకుని క్యాబ్‌ నడుపుకుంటున్నాడు. సెప్టెంబర్‌ 9(2023)న రాజ్‌కుమార్‌ ఇంటి వద్దే ఉండటంతో భోజనంన చేసిన కాసేపు కునుకేశాడు. నిద్రలేచాక యధాలాపంగా ఫోన్ చూసుకోగా ఓ మెసేజ్ కనిపించింది.తన బ్యాంక్ ఎకౌంట్ (Tamilnad Mercantile Bank) లోకి రూ.9వేల కోట్లు జమ అయ్యాయి అని ఆ మెసేజ్ సారాంశం. అది చూసిన రాజ్‌కుమార్‌ షాక్‌ అయ్యాడు.. కేవలం రూ.105లు ఉన్న తన ఎకౌంట్ లోకి అంత డబ్బు ఎందుకొస్తుంది… పొరపాటున మెసేజ్ వచ్చిందేమో అనుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులు ఆట పట్టించేందుకు అలా చేసి ఉంటారని అనుకున్నాడు. తన ఎకౌంట్ లో అంత డబ్బు ఉందనే ఫీలింగ్ బాగుంది అనుకున్నాడో ఏమోగానీ ఆ మెసేజ్‌ను రిపీట్‌గా చదవాడు. తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ నుంచి వచ్చిన అధికారిక మెసేజ్‌గా గుర్తించాడు. ఆ మెసేజ్ లో ఉన్న సున్నాలు లెక్కించే క్రమంలో కూడా ఆ ఉద్వేగంలో తడబడ్డాడు.

Rahul Gandhi : కూలీగా మారిన రాహుల్‌గాంధీ, రెడ్ షర్టు ధరించి రైల్వే స్టేషన్‌లో సూట్‌కేసు మోసిన రాహుల్‌

ఈక్రమంలో తన స్నేహితుడికి రూ.21వేలు ట్రాన్స్ ఫర్ చేశాడు. నిజమేనని తేలింది. కానీ అంతలోనే బ్యాంక్ షాక్ ఇచ్చింది రాజ్ కుమార్ కు. తన ఎకౌంట్ లో పడిన భారీ మొత్తం అంతా కొన్ని నిమిషాల్లోనే తిరిగి డెబిట్ అయిపోయింది. దీంతో మరోసారి దిమ్మ తిరిగిపోయింది రాజ్ కుమార్ కు. కోట్ల డబ్బు రావటమేంటి…కళ్లముందే మళ్లీ పోవటమేంటి..? అనుకున్నాడు.

ఈక్రమంలో బ్యాంకు అధికారులు అతనిని సంప్రదించి..మీ ఎకౌంట్ లో పడిన డబ్బు పొరపాటున జమ అయ్యిందని ఎక్కువ డబ్బు తీసుకోవద్దని కోరారు. రాజ్ కుమార్ ను సంప్రదించిన వారిలో ఓ అధికారి మాత్రం డబ్బు తీసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రాజ్ కుమార్ ఓ న్యాయవాదిని సంప్రదించి బ్యాంక్ వద్దకెళ్లాడు. అక్కడ ఇరు వర్గాలకు చర్చలు జరిగాయి. బ్యాంకు అధికారులు అతని ఎకౌంట్ లో అంత పెద్ద మొత్తం వేయటం తప్పని అది పొరపాటున జరిగి ఉండొచ్చు..కానీ బెదిరించటం సరికాదు అంటూ వాదించాడు. దీంతో బ్యాంకు అధికారులు మాలో ఒకరు పొరపాటున నోరు జారారని దాన్ని పట్టించుకోవద్దని సర్ధి చెప్పారు. అంతేకాదు రాజ్ కుమార్ విత్ డ్రా చేసుకున్న రూ.21 వేలు తిరిగి ఇవ్వనవసరం లేదని..అలాగే బ్యాంకు నుంచి కారు లోన్ ఇస్తామని ఆఫర్ చేశారు. అలా వారి గొడవ సర్ధుమణిగింది.

ఈ ఘటనపై రాజ్ కుమార్ మాట్లాడుతు..అంతపెద్దమొత్తంలో డబ్బులు జమ అవ్వడం.. మొదట చూసి సున్నాలు ఎక్కువగా ఉండటంతో డబ్బులు మొత్తం ఎన్ని జమ అయ్యాయో లెక్కించలేకపోయానని తెలిపాడు. రూ.9వేల కోట్ల రూపాయలు జమ అవ్వడానికి ముందు తన ఖాతాలో రూ.105 మాత్రమే ఉన్నాయని.. రూ.21వేలు స్నేహితుడికి పంపిన తర్వాత కాసేపటికే మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ద్వారా డెబిట్ చేయబడిందని రాజ్‌కుమార్ తెలిపాడు.

 

ట్రెండింగ్ వార్తలు