Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో తొలి బంగారు ప‌త‌కం సాధించిన దేశం ఏదో తెలుసా..?

పారిస్ ఒలింపిక్స్ 2024లో ప‌త‌కాల వేట మొద‌లైంది.

China wins first gold medal of Paris 2024 Olympics

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ 2024లో ప‌త‌కాల వేట మొద‌లైంది. ఈ సారి తొలి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని చైనా కైవ‌సం చేసుకుంది. 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో చైనా గోల్డ్ మెడ‌ల్‌ను గెలుచుకుంది. శనివారం ఛటౌరోక్స్‌లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో ద‌క్షిణ‌కొరియాను చైనా ఓడించింది. చైనాకు చెందిన హువాంగ్ యుటింగ్-షెంగ్ లిహావో లు ద‌క్షిణాఫ్రికాకు క్యూమ్ జి హైయోన్ – పార్క్ హజున్‌లను 16-12 తేడాతో ఓడించింది.

అంతకుముందు కాంస్య పతక పోరులో జ‌ర్మ‌నీ పై కజకిస్తాన్ విజ‌యం సాధించింది. కజకిస్తాన్‌కు చెందిన‌ అలెగ్జాండ్రా లే- ఇస్లాం సత్‌పయేవ్ లు 17-5 తేడాతో జర్మనీ కి చెందిన అన్నా జాన్సెన్- మాక్సిమిలియన్ ఉల్బ్రిచ్‌పై గెలుపొంది పారిస్ ఒలింపిక్స్‌లో తొలి ప‌తకాన్ని సాధించారు.

IND vs SL : శ్రీలంక‌తో టీ20 సిరీస్‌.. మొబైల్‌లో ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుస్తా..?

కాగా.. ఈ విభాగంలో భార‌త్‌కు నిరాశే మిగిలింది. రెండు బృందాలు పాల్గొన‌ప్ప‌టికి నిరాశ త‌ప్ప‌లేదు. రమితా జిందాల్- అర్జున్ బాబుటా 628.7 స్కోరుతో ఆరో స్థానంలో నిలవగా, ఎలవెనిల్ వలరివన్-సందీప్ సింగ్ 626.3 స్కోరుతో 12వ స్థానంలో నిలిచారు. ఈ జోడీలు టాప్‌-4కు అర్హ‌త సాధించ‌డంలో విఫ‌లం అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు