Tanvi Marupallyz: లైబ్రరీలో చిక్కింది.. 75 రోజుల తరువాత యూఎస్‌లో తల్లిదండ్రుల వద్దకు చేరిన తెలుగమ్మాయి తన్వి..

అమెరికాలో నివాసముంటున్న 15ఏళ్ల తెలుగు యువతి తన్వి మరుపల్లి జనవరి 17న తన ఇంటి నుంచి పారిపోయింది. వీరి కుటుంబం అర్కాన్సాస్ ప్రాంతంలో నివాసముంటుంది. అయితే 75 రోజులు తరువాత యూఎస్ పోలీసులు తన్వి ఆచూకీ లభించడంతో ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

Tanvi Marupally : అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగు యువతి మరుపల్లి తన్వి ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం విధితమే. ఆమె ఇంటినుంచి వెళ్లిపోయి 75రోజులు అవుతుంది. సుదీర్ఘ వెతుకులాట తర్వాత పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించగలిగారు. అర్కాన్సాస్‌లోని తన్వి నివాసానికి 1600 కిలో మీటర్ల దూరంలోని ప్లోరిడాలో ఆమె సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను తన కుటుంబ సభ్యులతో చేర్చడం జరిగిందని అన్నారు. ప్లోరిడాలోని టంపా ప్రాంతంలో స్థానిక లైబ్రరీలో మరుపల్లి తన్వి ఆచూకీని అక్కడి పోలీసులు గుర్తించారు. కాన్వే పోలీసు చీఫ్ విలియం ట్యాప్లీ మాట్లాడుతూ.. ప్లోరిడాలోని టంపా ప్రాంతంలో స్థానిక లైబ్రరీలో ఆమె చేయగలిగే ఉద్యోగాల కోసం వేటలో ఉన్నట్లు గుర్తించామని అన్నారు. లైబ్రరీ పట్ల ఆమెకున్న ప్రేమ చివరికి ఆమె ఆచూకీ తెలుసుకొనేలా చేసిందని అన్నారు.

Missing Case: టెర్రస్‌పై ఆడుకునేందుకు వెళ్లిన అక్కాతమ్ముళ్లు అదృశ్యమైన వైనం

అమెరికాలో నివాసముంటున్న 15 ఏళ్ల తెలుగు యువతి తన్వి మరుపల్లి జనవరి 17న తన ఇంటి నుంచి పారిపోయింది. వీరి కుటుంబం అర్కాన్సాస్ ప్రాంతంలో నివాసముంటుంది. 2022-23లో అమెరికాలో దాదాపు మూడు లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించారు. తన్వి తండ్రి పవన్ రాయ్ మరుపల్లి ఒక టెక్ కంపెనీలో ఉధ్యోగంచేస్తున్నాడు. ఆయన లే ఆఫ్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అప్పటికే అతని భార్య, తన్వి తల్లి శ్రీదేవి ఉద్యోగం కోల్పోయింది. తండ్రి ఉద్యోగం కూడా పోతే తన కుటుంబం యూఎస్ వదిలి వెళ్లాల్సి వస్తుందోనన్న ఆందోళనతో మరుపల్లి తన్వి ఇంటి నుంచి పారిపోయింది. ఆమె కోసం వెకుతులాట ప్రారంభించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. తన్వి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Small Capsule Missing: ఆస్ట్రేలియాలో ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నరేడియోధార్మిక క్యాప్సూల్.. దానిని తాకొద్దంటూ అధికారుల హెచ్చరికలు

తన్వి ఆచూకీ తెలిపితే రూ. 25వేల డాలర్లు బహుమానం కూడా తల్లిదండ్రులు ప్రకటించారు. 74 రోజులైనా ఆచూకీ లభించలేదు. గురువారం నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లోయిటెడ్ చిల్డ్రన్ నుంచి హెచ్చరికల తరువాత పోలీసులు తన్వి ఆచూకీ గుర్తించారు. ప్లోరిడాలోని టంపా ప్రాంతంలో స్థానిక లైబ్రరీలో ఆమె చేయగిలిగే ఉద్యోగాల కోసం వెతుకులాటలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లైబ్రరీ పట్ల ఆమెకున్న ప్రేమ చివరికి ఆమె ఆచూకీ దొరికేందుకు కారణమైందని విలియం ట్యాప్లీ చెప్పారు. తన్వి చాలా తెలివైన యువతి అని, తాను ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత నడవడం, రైళ్లలో ప్రయాణించడం, నిరాశ్రయులైన ఆశ్రయాల్లో నివసించడం.. ఇలా పలు ప్రాంతాల్లో తన జీవనాన్ని సాగిస్తూ వెళ్లిందని తెలిపారు. తన్వి ఆచూకీ దొరికిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఆమెను కుటుంబంతో చేర్చారు.

ట్రెండింగ్ వార్తలు