China: చైనా కీలక నిర్ణయం.. 5కోట్ల కంప్యూటర్లను పక్కనపడేయనున్న ప్రభుత్వం!

చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిప్స్, సర్వర్లు, ఫోన్లు మొదలుకొని ప్రతిదానిపై అమెరికా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఈ నిర్ణయం...

China: చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిప్స్, సర్వర్లు, ఫోన్లు మొదలుకొని ప్రతిదానిపై అమెరికా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఈ నిర్ణయం దశాబ్ద కాలం నాటి నుంచి ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయిలో తాజా నిర్ణయాన్ని అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర ప్రభుత్వ విభాగాలతో మొదలై ప్రొవిన్షియల్ ప్రభుత్వ విభాగాల్లోనూ స్థానిక సంస్థల తయారీ కంప్యూటర్ల వాడకం మొదలు కానుంది.

China : రంగు మారిన ఆకాశం-వణికిపోయిన చైనా ప్రజలు

ముఖ్యంగా ప్రధాన విభాగాల్లో విదేశీ సాంకేతికతలను పక్కనబెట్టే దిశగా చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ బ్రాండ్ పర్సనల్ కంప్యూటర్ల వాడకం మానేసి దేశీయ సంస్థలనే కొనాలంటూ ప్రభుత్వం ఆదేశాలుసైతం జారీ చేసింది. ఈ రెండేళ్లలో పూర్తిస్థాయిలో ఆదేశాలు అమలు కావాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని సుమారు 5 కోట్ల కంప్యూటర్లను పక్కనపడేయనున్నట్లు తెలుస్తోంది. వీటి స్థానంలో స్థానికంగా డిజైన్ చేసిన సాప్ట్ వేర్ తో కూడిన కంప్యూటర్లను వినియోగించనున్నారు.

India-China LAC Issue: డ్రాగన్ బుద్ది మారలె.. పాంగోంగ్ సరస్సుపై కొత్త వంతెన సమీపంలో

ప్రస్తుతం చైనాలో దేశీయ సంస్థ లెనోవో తర్వాత అమెరికా కంపెనీలైన హెచ్‌పి, డెల్ కంప్యూటర్లే ఎక్కువగా అమ్మడవుతున్నాయి. నూతన విధానంతో అమెరికాకు చెందిన హెచ్‌పీ, డెల్ తదితర సంస్థలపై మరింత ఒత్తిడి పెరగనుంది. అయితే పీసీ బ్రాండ్లు, సాప్ట్ వేర్ కే తప్ప ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల మార్పిడిపై ఎలాంటి ఆదేశాలు లేవని బ్లూమ్ బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. దేశీయ తయారీదారు లెనోవా తర్వాత దేశంలో అతిపెద్ద పీసీ బ్రాండ్‌లైన హెచ్‌పి, డెల్ టెక్నాలజీస్ కొత్త వ్యూహం ప్రకారం దశలవారీగా తొలగించబడతాయి. 2021 నాల్గవ త్రైమాసికంలో చైనా యొక్క పీసీ షిప్‌మెంట్‌లు 9% పెరిగి 16.5 మిలియన్ యూనిట్‌లకు చేరుకున్నాయి. ఇంకా చైనీస్ మార్కెట్ అద్భుతమైన వృద్ధితో ఒక సంవత్సరం ముగిసింది, 2021లో ఎగుమతులు 10% పెరిగి రికార్డు స్థాయిలో 57మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. లెనోవో మార్కెట్ వాటాలో 41.8శాతం, డెల్ 12.5శాతం, హెచ్‌పీ 9.2శాతం, ఆసుస్ 5.5శాతం, ఏసర్ 5.2శాతంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు