Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాలో 15వేలు దాటిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద కొనసాగుతున్న అన్వేషణ

టర్కీ, సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ గుట్టలు గుట్టలుగా మృతదేహాలు బయటపడుతున్నాయి. రెండు దేశాల్లోనూ 15వేల మృతదేహాలను అధికారులు గుర్తించారు.

Turkiye Syria Earthquake: టర్కీ, సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ గుట్టలు గుట్టలుగా మృతదేహాలు బయటపడుతున్నాయి. రెండు దేశాల్లోనూ 15వేల మృతదేహాలను అధికారులు గుర్తించారు. గాయపడిన వారి సంఖ్య సుమారు 60వేల వరకు ఉంటుంది. వారికి స్థానిక ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, నేలమట్టమైన శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 8వేలు దాటిన మృతుల సంఖ్య

టర్కీ, సిరియా దేశాల్లోని అనేక ప్రాంతాల్లో సోమవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 7.8 గా భూకంపం తీవ్రత నమోదైంది. ఈ భూకంపం దాటికి ఇరు ప్రాంతాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఇరు దేశాల్లో ఇప్పటి వరకు వందలసార్లు ప్రకంపనలు రావటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. భూకంప ప్రభావిత నగరాలు, పట్టణాల్లో బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. టర్కీలో 12,391 మంది మరణించగా, 62,914 మంది గాయపడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సిరియాలో 3,486 మంది మరణించగా, 5,247 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Turkey Earthquake : టర్కీలో మళ్లీ భారీ భూకంపం.. గంటల వ్యవధిలో రెండోసారి

రెండు దేశాల్లో భూకంపం దాటికి కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగించే ప్రక్రియను రెస్క్యూ సిబ్బంది నిరంతరం కొనసాస్తున్నారు. టర్కీలోని భూకంప ప్రభావిత నగరాల్లో.. రాజధాని అంకారా, నూర్దగితో సహా 10 నగరాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు