సోమవారం ఐరన్ చేయని డ్రెస్‌తో ఆఫీసుకు రండి.. సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం

అందేటి ఆఫీసుకు వచ్చేవారు ఇస్త్రీ బట్టలేసుకుని, హుందాగా ఉండాలని యాజమాన్యాలు కోరుకుంటున్నాయి కదా. CSIR ఎందుకిలా చెబుతోంది?

CSIR Wrinkles Acche Hai: వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం నాడు ఉద్యోగులంతా నీట్ గా డ్రెస్ చేసుకుని ఆఫీసులకు వెళుతుంటారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మాత్రం ప్రతి సోమవారం ఇస్త్రీ చేసిన డ్రెస్ వేసుకుని రావొద్దని కోరుతుంది. అందేటి ఆఫీసుకు వచ్చేవారు ఇస్త్రీ బట్టలేసుకుని, హుందాగా ఉండాలని యాజమాన్యాలు కోరుకుంటున్నాయి కదా. CSIR ఎందుకిలా చెబుతోంది?

కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయిస్ వీకెండ్స్ లో ఫార్మల్ దుస్తులకు దూరంగా ఉంటారు. ‘థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే’ లేదా ‘క్యాజువల్ ఫ్రైడే’ పేరుతో సెమీఫార్మల్ డ్రెస్సుల్లో ఆఫీసులకు వస్తుంటారు. దీనికి భిన్నంగా వారం ఆరంభంలోనే అంటే సోమవారం నాడు ఐరన్ చేయని దుస్తులు ధరించి ఆఫీసుకు రావాలని తమ ఉద్యోగులను CSIR తమ ఉద్యోగులను కోరుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా ఇలా చేస్తోందట.

‘స్వచ్ఛతా పఖ్వాడా’లో కార్యక్రమంలో భాగంగా ‘రింకిల్స్ అచ్చే హై’ (WAH) ప్రచారాన్ని సీఎస్ఆర్ ప్రారంభించింది. ప్రతీ సోమవారం ఐరన్ చేయని దుస్తులను ధరించి పని చేసేలా చేయడం దీని ఉద్దేశం. పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతుగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెక్రటరీ, CSIR మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ కలైసెల్వి తెలిపారు. “సోమవారాల్లో ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ద్వారా పర్యావర పరిరక్షణకు సహకరించాలని CSIR నిర్ణయించింది. ఒక జత ఇస్త్రీ చేయడం వల్ల 200 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. కాబట్టి, ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ద్వారా 200 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చు. భూమి తల్లిని కాపాడుకోవడానికి మా వంతుగా ఇది చేస్తున్నామ”ని ఆమె వివరించారు.

Also Read: గణితంలో 200 మార్కులకు 212 మార్కులు సాధించిన బాలిక.. అదెలా సాధ్యమైందో తెలుసా?

దేశంలోని అన్ని CSIR ల్యాబ్‌లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అమలు చేస్తోంది. కార్యాలయాల్లో విద్యుత్ ఛార్జీలను 10 శాతం తగ్గించడం ప్రారంభ లక్ష్యంగా పెట్టుకుంది. జూన్-ఆగస్టు 2024లో పైలట్ ట్రయల్‌గా దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. కాగా, పర్యావరణ మార్పులను గమనించడానికి ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని CSIR ప్రధాన కార్యాలయ భవనంలో దేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు