గణితంలో 200 మార్కులకు 212 మార్కులు సాధించిన బాలిక.. అదెలా సాధ్యమైందో తెలుసా?

Fourth grader: బాలిక పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు వెలువడడంతో మార్క్ షీట్ చూసుకుంది.

గణితంలో 200 మార్కులకు 212 మార్కులు సాధించిన బాలిక.. అదెలా సాధ్యమైందో తెలుసా?

Scores 212 in Mathematics

వంశీబెన్ మనీష్ భాయ్ అనే బాలిక నాలుగో తరగతి చదువుతోంది. అన్ని సబ్జెక్టుల్లోనూ మార్కులు బాగా తెచ్చుకునేది. సాధారణంగా 200 మార్కులకు 200 మార్కులు వస్తే విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. అయితే, 200 మార్కులకు 212 మార్కులు వస్తే? షాక్ కు గురవుతారు.

అసలు ఒక్క సబ్జెక్ట్ మార్కులు మొత్తం 200 ఉంటే 212 ఎలా వస్తాయి? టీచర్లు, మార్కులు అప్‌లోడ్ చేసేవాళ్ల తలతిక్క పనులతో ఆ విద్యార్థినికి ఇన్ని మార్కులు వచ్చాయి. గుజరాతీ సబ్జెక్ట్, మ్యాథ్స్‌తో పాటు అన్ని పరీక్షలు ఒక్కోపేపర్ కు 200 మార్కుల చొప్పున నిర్వహించారు.

గుజరాత్‌లోని ఖరాసానాలో నివసించే వంశీబెన్ మనీష్ భాయ్ అనే బాలిక పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు వెలువడడంతో మార్క్ షీట్ చూసుకుంది. గుజరాతీ సబ్జెక్ట్ లో ఆమెకు 200 మార్కులకు గాను 211 వచ్చినట్లు, మ్యాథ్స్ లో 200 మార్కులను గానూ 212 వచ్చినట్లు అందులో కనపడింది. దీంతో ఆమెను స్కూల్ యజమాన్యాన్ని సంప్రదించగా ఓ తప్పు వల్ల అలా జరిగిందని చెప్పారు.

ఆ తర్వాత అసలైన మార్కులు వేశారు. దీంతో ఆ బాలికకు గుజరాతీలో 191, మ్యాథ్స్ లో 190 మార్కులు వచ్చాయి.
దీంతో జిల్లా విద్యాధికారులు ఏ తప్పువల్ల ఆ బాలికకు మొదట మార్కులు ఎక్కువ వచ్చాయన్న విషయంపై విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని చెప్పారు.

Also Read : ఆసిఫాబాద్ జిల్లా నీట్ ఎగ్జామ్‌లో గందరగోళం.. తారుమారైన పేపర్లు.. ఆందోళనలో విద్యార్థులు