NEET UG Exam : ఆసిఫాబాద్ జిల్లా నీట్ ఎగ్జామ్‌లో గందరగోళం.. తారుమారైన పేపర్లు.. ఆందోళనలో విద్యార్థులు

ఒక సెట్ కు బదులు మరో సెట్ నుంచి ప్రశ్నాపత్రాలు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఈ విషయాన్ని ఆసిఫాబాద్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.

NEET UG Exam : ఆసిఫాబాద్ జిల్లా నీట్ ఎగ్జామ్‌లో గందరగోళం.. తారుమారైన పేపర్లు.. ఆందోళనలో విద్యార్థులు

NEET exam Students

NEET Exam Paper : వైద్య విద్యలో ప్రవేశాలకోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఆదివారం ముగిసింది. ఈ ఎగ్జామ్ లో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు అందించిన పేపర్ ఒకటైతే.. ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ లో ఎగ్జామ్ పేపర్ తారుమారైంది. ఎస్బీఐ నుంచి తేవాల్సిన క్వశ్చన్ పేపర్ ను నిర్వాహకులు కెనరా బ్యాంకు నుంచి తెచ్చారు. 299 మంది విద్యార్థులు తారుమారైన క్వశ్చన్ పేపర్ తో పరీక్ష రాశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Jharkhand : ఝార్ఖండ్‌లో ఈడీ దాడులు.. మంత్రి పీఏ పనిమనిషి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

ఒక సెట్ కు బదులు మరో సెట్ నుంచి ప్రశ్నాపత్రాలు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఈ విషయాన్ని ఆసిఫాబాద్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై పరీక్ష నిర్వహించిన సిటీ కో-ఆర్డినేటర్ మాట్లాడుతూ.. సమాచార లోపంతో ఎస్బీఐ నుంచి బదులు కెనరా బ్యాంకు నుంచి పేపర్ తీసుకురావటంతో ఈ సమస్య తలెత్తిందని తెలిపారు.

అయితే, నీట్ యూజీ పరీక్ష పేపర్ మార్పుపై అధికారులు స్పందించారు. ఆర్డీవో లోకేశ్వర్ విచారణ చేపట్టారు. ఈ విషయంపై ఆసిఫాబాద్ పరీక్ష కేంద్రం కో- ఆర్డినేటర్ ను ఆర్డీవో ప్రశ్నించారు.