Rajamouli : బాహుబలి సిరీస్‌లు వస్తూనే ఉంటాయి.. ఫ్యాన్స్‌కి పండగే.. యానిమేషన్ సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

Rajamouli : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా ముఖ్య పాత్రలతో వచ్చిన బాహుబలి 1, 2 సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. తెలుగు పరిశ్రమ స్థాయిని పాన్ ఇండియాకి పరిచయం చేసి వేల కోట్ల కలెక్షన్స్ సాధించాయి. ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకి ఎనలేని గుర్తింపు తెచ్చారు రాజమౌళి. బాహుబలి(Baahubali) రెండు సినిమాల్లో మనం చూసింది కొంత కథే. మాహిష్మతి రాజ్యాన్ని అందులో పాత్రలని అల్లుకొని ఇంకా చాలా కథలు ఉన్నాయి.

గతంలో రాజమౌళి ఆ పాత్రలు, కథలు ఏదో ఒక రూపంలో వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే యానిమేషన్ సిరీస్ రూపంలో రాబోతున్నాయి. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మే 17 నుంచి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ రానుంది. ఈ సిరీస్ కొత్త కథతో రాబోతుంది. బాహుబలి అనుష్కని కలవకముందు, కాలకేయ రాకముందు మాహిష్మతి రాజ్యంలో జరిగే సంఘటనలు, యుద్ధాల నేపథ్యంలో ఈ సిరీస్ రానుంది.

Also Read : Nikhil Siddhartha : వామ్మో నిఖిల్ సినిమాలో ఒక్క ఫైట్ కోసం అన్ని కోట్లా.. ‘స్వయంభు’ని భారీగానే ప్లాన్ చేస్తున్నారుగా..

తాజాగా బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలి ప్రపంచం చాలా పెద్దది. ఈ కథలో ప్రతి పాత్రకు ఇంకో కథ ఉంటుంది. అలాంటి కథలన్నీ ప్రేక్షకులకు ఏదో ఒక రూపంలో చెప్పాలనుకున్నాం. బాహుబలి కథలను అన్ని రకాల ప్రేక్షకులకు సినిమా, యానిమేషన్, కామిక్ బుక్స్, గేమ్స్.. ఇలా చాలా రకాలుగా ప్రజల్లోకి తీసుకురాబోతున్నాము. ఇప్పుడు ఈ యానిమేషన్ సిరీస్ కి కూడా సీజన్స్ ఉండబోతున్నాయి. ఈ కథ నా దగ్గర్నుంచి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం బాధపడ్డాను, కానీ నేను కూడా వాళ్ళతో కూర్చొని ఈ బాహుబలి యానిమేషన్ సిరీస్ ని తీసాము అని తెలిపారు.

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ ను గ్రాఫిక్ ఇండియా, ఆర్క మీడియా బ్యానర్స్ పై దర్శకుడు S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించారు. జీవన్ జె. కాంగ్, నవీన్ జాన్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. బాహుబలి మాహిష్మతిలోని చాలా కథలని ఇలా యానిమేషన్ సిరీస్ రూపంలో తీసుకురావడంతో ప్రభాస్, బాహుబలి సినిమా అభిమానులు సంతోషిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు