Cm Revanth Reddy : భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

డ్రైనేజీలు, నాలాల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వాన కురుస్తుండటంతో అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, విద్యుత్, పోలీసు శాఖ అధికారులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్.. వారికి పలు సూచనలు చేశారు. వర్షాలతో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. డ్రైనేజీలు, నాలాల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సమ్మర్ లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు..
మండు వేసవిలో హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన ముంచెత్తింది. గంటకు పైగా వాన పడటంతో రహదారులు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో వాన దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్ పల్లి, మూసాపేట సర్కిల్ లో 7 సెమీ, యూసుఫ్ గూడలో 4 సెమీ, ఫతేనగర్ లో 4 సెమీ, శేరిలింగం పల్లి, చందానగర్, హైటెక్ సిటీలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేసవి కాలంలో ఎప్పుడూ లేనంతగా హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న వేళ ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. వారికి పలు సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. అనవసరంగా బయటికి రావొద్దని అధికారులు చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, చెట్ల కింద, శిథిల భవనాల్లో ఉండొద్దన్నారు. స్విచ్ బోర్డులు, కరెంట్ స్థంభాలకు దూరంగా ఉండాలన్నారు. వాహనదారులు అలర్ట్ గా ఉండాలని చెప్పారు. మ్యాన్ హోల్స్ దగ్గర మరింత జాగ్రత్త అవసరం అన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులకు చెప్పాలన్నారు. సొంతంగా రిపేర్లు చేయొద్దని సూచించారు.

Also Read : తడిసిన ఉప్పల్ స్టేడియం.. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? భారీ వర్షంతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ

 

ట్రెండింగ్ వార్తలు