Sai Karthik : ‘100 క్రోర్స్’తో నిర్మాతగా మారబోతున్న సంగీత దర్శకుడు..
టాలీవుడ్ లో ఓ సంగీత దర్శకుడు నిర్మాతగా మారాడు.
- Saketh U
- Published On : May 7, 2024 / 08:39 PM IST
Music Director Sai Karthik turned as Producer with 100 Crores Movie
Music Director Sai Karthik : సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్స్, ఆర్టిస్టులు, దర్శకులు.. ఇలా ఎవరో ఒకరు నిర్మాతలుగా కూడా మారుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సంగీత దర్శకుడు నిర్మాతగా మారాడు. ఎన్నో ఏళ్ళ నుంచి మంచి మంచి సినిమాలతో మ్యూజిక్ అందిస్తున్న సాయి కార్తీక్ నిర్మాతగా మారుతూ ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ‘100 క్రోర్స్’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు.
ఇటీవల సినిమాలు 100 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంటే వీళ్ళు ఏకంగా ‘100 క్రోర్స్’ అనే టైటిల్ తో రావడం గమనార్హం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 2016లో డీ మానిటైజేషన్ సమయంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తీసినట్టు తెలిపారు. దివిజా కార్తీక్, సాయి కార్తీక్ నిర్మాతలుగా ఎస్.ఎస్.స్టూడియోస్ బ్యానర్ పై విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
Also Read : Rajamouli : బాహుబలి సిరీస్‌లు వస్తూనే ఉంటాయి.. ఫ్యాన్స్‌కి పండగే.. యానిమేషన్ సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే..
ఈ సినిమాతో కన్నడ హీరో చేతన్ తెలుగులో పరిచయం అవుతున్నాడు. చేతన్ మెయిన్ లీడ్ గా ఈ ‘100 క్రోర్స్’ సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమాలో రాహుల్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్.. లాంటి పలువురు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ‘100 క్రోర్స్’ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ కి దర్శకులు వీర శంకర్, మల్లిక్ రామ్, నిర్మాత హర్షిత్ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక లారీ ఉండటం గమనార్హం. ఇది డబ్బుతో ఉన్న లారీ అని తెలుస్తుంది. గెస్టులు మాట్లాడుతూ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ తో తమకు ఉన్న అనుబంధం గురించి తెలిపి నిర్మాతగా మారుతున్నందుకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
