Adhey Neevu Adhey Nenu : ‘అదే నీవు అదే నేను’ సినిమా నుంచి ‘తుళ్లిపడకే మనసా..’ లవ్ సాంగ్ విన్నారా..?
ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అవ్వగా తాజాగా లవ్ సాంగ్ ని రిలీజ్ చేసారు. (Adhey Neevu Adhey Nenu)
Adhey Neevu Adhey Nenu
Adhey Neevu Adhey Nenu : త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘అదే నీవు అదే నేను’. శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మాణంలో కొండల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అవ్వగా తాజాగా లవ్ సాంగ్ ని రిలీజ్ చేసారు.
అదే నీవు అదే నేను సినిమా నుంచి తుళ్లిపడకే మనసా.. అనే లవ్ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క సంగీత దర్శకత్వంలో పూర్ణాచారి రాయగా సింగర్ జావెద్ అలీ పాడారు. కొరియోగ్రాఫర్ వేద ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసింది. ఈ సాంగ్ ని దర్శకుడు వి.వి.వినాయక్ రిలీజ్ చేసారు.
Also Read : Ram Charan : వాళ్ళ కోసం 40 లక్షల విరాళం ఇచ్చిన రామ్ చరణ్.. 18 లక్షలు ఇచ్చిన జానీ మాస్టర్..
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
సాంగ్ రిలీజ్ అనంతరం డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. మనసా మనసా.. సాంగ్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. దర్శకుడు కొండల్, నిర్మాతలకు మంచి హిట్ సినిమా అవ్వాలి అని అన్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుందని మూవీ యూనిట్ తెలిపారు.

