Mister Middle Class Trailer : ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ట్రైలర్ వచ్చేసింది.. వేంకటేశ్వరస్వామిగా రాజేంద్రప్రసాద్.. ఒకప్పటి హిట్ కాంబో..
మీరు కూడా 'మిస్టర్ మిడిల్ క్లాస్' ట్రైలర్ చూసేయండి..
Mister Middle Class Trailer
Mister Middle Class Trailer : గతంలో ఎన్నో సూపర్ హిట్ కామెడీ సినిమాల్లో కలిసి నటించిన శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ ఇప్పుడు మరోసారి కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అనే సినిమాతో జులై 17న రానున్నారు. బాలు J క్రియేషన్స్ బ్యానర్ పై కామెడీ సినిమాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లయ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ వెంకటేశ్వరస్వామిగా, శ్రీకాంత్ ఆయన భక్తుడిగా కనిపించబోతున్నారు. డబ్బులు లేవని బాధపడే భక్తుడికి అనుకోకుండా ఎక్కువ డబ్బులు వస్తే వచ్చే కష్టాలు ఏంటి అని కామెడీతో పాటు ఎమోషనల్, థ్రిల్లర్ గా కూడా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
మీరు కూడా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ట్రైలర్ చూసేయండి..
