Singapore Covid Infections : సింగపూర్‌ కొత్త కొవిడ్ కేసులలో మూడొంతుల మంది వ్యాక్సిన్ వేయించుకున్నవారే!

సింగపూర్‌లో కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. సింగపూర్ కరోనా కొత్త కేసుల్లో మూడొంతుల మంది వ్యాక్సిన్ వేయించుకున్నవారే ఉన్నారట..

Singapore Covid Infections : సింగపూర్‌లో కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కూడా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. గత నాలుగు వారాల్లో సింగపూర్ కరోనా కొత్త కేసుల్లో మూడొంతుల మంది వ్యాక్సిన్ వేయించుకున్నవారే ఉన్నారట.. ఈ మేరకు అక్కడి ప్రభుత్వ  డేటా వెల్లడించింది. నగరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయగా.. కొద్ది మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. సింగపూర్‌లో 5.7 మిలియన్ల మంది జనాభాలో ఇప్పటికే దాదాపు 75శాతం మందికి వ్యాక్సిన్ అందింది. తద్వారా యూఏఈ తర్వాత ప్రపంచంలోనే రెండో దేశంగా నిలిచింది. దేశంలో సగం జనాభాకు పూర్తి డోసుల వ్యాక్సిన్ అందింది.

గత 28 రోజుల్లో స్థానికంగా 1,096 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో 44శాతం పూర్తిగా వ్యాక్సిన్ అందుకోగా వారిలో 484 మంది ఉన్నారు. 30 శాతం మంది మాత్రమే పాక్షికంగా వ్యాక్సిన్ అందుకున్నారు. మిగిలిన 25 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఏడు కరోనా తీవ్ర కేసులు మాత్రమే ఆక్సిజన్ సపోర్టు అవసరం పడుతోంది. అందులో ఆరుగురు వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఒకరు మాత్రమే ఒక డోసు టీకా తీసుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. పూర్తి వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. టీకా తీసుకున్నప్పటికీ కరోనా సోకినంత మాత్రానా వ్యాక్సిన్లు పనిచేయడం లేదని అర్థం కాదని నిపుణులు చెబుతున్నారు.

సింగపూర్ 100శాతం పూర్తిగా టీకాలు రేటు సాధిస్తే.. అప్పుడు అన్ని ఇన్ఫెక్షన్లు టీకాలు వేసిన వ్యక్తుల నుంచే ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకోనివారు ఉండరు. గత 14 రోజులలో 61 ఏళ్లు పైబడిన వారిలో టీకాలు వేయగా.. 88శాతం కేసులు నమోదయ్యాయి. యువకుల కంటే పెద్దవారే ఎక్కువగా ఉన్నారని డేటా తెలిపింది. అంటే.. టీకాపై వృద్ధులకు రోగనిరోధక ప్రతిస్పందన బలహీనంగా ఉందని తేలింది. అధిక టీకా రేటు ఉన్న ఇజ్రాయెల్‌లో జూలై ఆరంభం నాటికి ఆస్పత్రిలో చేరిన 46 మంది బాధితుల్లో సగం మందికి టీకాలు వేశారు. వీరిలో ఎక్కువ మంది రిస్క్ గ్రూపులకు చెందినవారేనని అధికారులు తెలిపారు. సింగపూర్‌లో డెల్టా వేరియంట్‌కు టీకాలు అందించే రక్షణపై ఇటీవలి నెలల్లో డేటా ఉందో లేదో స్పష్టత లేదు. సింగపూర్ జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఫైజర్ /బయోఎంటెక్ వ్యాక్సిన్, మోడెర్నా టీకాలను వినియోగిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు