Summer Diet : ఆయుర్వేదం చిట్కాలు.. మీ సమ్మర్ డైట్‌లో ఈ ఆహారాలను తప్పక చేర్చుకోండి..!

Summer Diet : ఆయుర్వేదం ఈ ఆహారాలను వేసవిలో భాగంగా చేసుకోవాలని సూచించింది. ఆయుర్వేదం ప్రకారం.. వేసవి కాలంలో మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.

Summer Diet : ఆయుర్వేదం అనేది ప్రాచీన భారతీయ వైద్య విధానం. ఆరోగ్యాన్ని ముఖ్యంగా వివిధ సీజన్లలో ఆహారం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వేసవిలో, వాతావరణం వేడిగా పొడిగా ఉన్నప్పుడు శరీరాన్ని చల్లబరచడానికి, హైడ్రేట్ చేయడానికి సాయపడే ఆహారాలను తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తుంది.

Read Also : Stress Physical Health : ఒత్తిడితో హైబీపీ, అజీర్ణం సమస్యలు.. మీ శారీరక ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందంటే?

అదే సమయంలో జీర్ణక్రియకు అవసరమయ్యే వాటిని తప్పక తీసుకోవాలని సూచిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. వేసవి కాలంలో మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాల జాబితాను ఓసారి పరిశీలిద్దాం. వేసవి కాలంలో ఆయుర్వేదం సిఫార్సు చేసిన 5 ఆహారాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. దోసకాయ :
దోసకాయలు అధిక నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. వేడి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో అద్భుతమైనవి. ఇందులో విటమిన్లు, మినరల్స్ కూడా ఉన్నాయి. చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. శరీరాన్ని చల్లబరుస్తాయి.

2. పుచ్చకాయ :
మరో హైడ్రేటింగ్ ఫ్రూట్.. పుచ్చకాయలో నీరు, ఎలక్ట్రోలైట్లు, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే సెల్యులార్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సాయపడతాయి. చల్లదనాన్ని కలిగించే స్వభావం ఉండటం చేత శరీరంలోని వేడిని తగ్గించి దాహాన్ని తీర్చడంలో సాయపడుతుంది.

3. కొబ్బరి నీరు :
కొబ్బరి నీరు సహజంగానే ఎలక్ట్రోలైట్ కలిగి ఉంటుంది. చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలు, ఖనిజాలను తిరిగి నింపడానికి సాయపడుతుంది. కూలింగ్, రిఫ్రెష్‌గా కూడా ఉంటుంది. వేసవిలో ఆరోగ్యకరమైన డ్రింక్‌గా చెప్పవచ్చు.

4. పుదీనా :
పుదీనా శరీరానికి చలవ చేస్తుంది. అజీర్ణాన్ని తగ్గిస్తుంది. వేడి-సంబంధిత సమస్యలను తగ్గించడంలో సాయపడుతుంది. కేలరీలు లేదా చక్కెరను కలపకుండా వంటకాలు, పానీయాలకు మంచి రుచిని కూడా అందిస్తుంది.

5. కొత్తిమీర :
కొత్తిమీర ఆకులు, గింజలు రెండింటిని ఆయుర్వేద వంటలలో ఉపయోగిస్తారు. వేడి జీవక్రియను సమతుల్యం చేయడానికి జీర్ణక్రియకు సాయపడతాయి.

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

ట్రెండింగ్ వార్తలు