Ukraine- Russia Crisis : రష్యా, యుక్రెయిన్ సంక్షోభం.. పుతిన్ ప్రకటనతో కొన్నిగంటల్లో జరిగిన పరిణామాలివే..!

యుక్రెయిన్ సంక్షోభం మరింతగా ముదురుతోంది. తూర్పు భాగంలో యుక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాలను 'స్వతంత్ర దేశాలు'గా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.

Ukraine Crisis : యుక్రెయిన్ సంక్షోభం మరింతగా ముదురుతోంది. దేశంలోని తూర్పు భాగంలో యుక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాలను ‘స్వతంత్ర దేశాలు’గా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఇదివరకే ప్రకటించారు. ఈ నిర్ణయంతో యుక్రెయిన్, రష్యా సంక్షోభం మరింత ముదిరింది. పుతిన్ నిర్ణయంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యాన్ని పోసినట్టయింది. ఒక్కసారిగా ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. గత కొన్ని గంటల్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. యుక్రెయిన్‌లో రష్యా మద్దతునిచ్చే వేర్పాటువాదుల నియంత్రణలో రెండు ప్రాంతాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాంఛనంగా గుర్తించారు. ఆ రెండు ప్రాంతాలపై లుహాన్క్, డోనెస్క్‌‌లు, రష్యా సైనిక బలగాలను పంపుతామని ఇప్పటికే పుతిన్ వెల్లడించారు. శాంతి పరిరక్షణ కార్యకలాపాలను సైనిక బలగాలు నిర్వర్తిస్తాయని పుతిన్ రష్యా ప్రజలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు.

వాస్తవానికి యుక్రెయిన్ అనేది.. ‘ప్రాచీన రష్యా భూమి’గా ప్రస్తావించారు. మోడ్రాన్ యుక్రెయిన్‌ను సోవియట్ రష్యానే క్రియేట్ చేసిందన్నారు. యుక్రెయిన్‌ను కీలుబొమ్మగా చేసి అక్కడి ప్రభుత్వం నడిపిస్తోందని పుతిన్ ఆరోపించారు. యుక్రెయిన్ దేశమంతా ‘అమెరికా కాలనీ’గా ఉందని ఆరోపించారు. పుతిన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆందోళనలు నెలకొన్నాయి. యుక్రెయిన్ మీద సైనిక ఆక్రమణకు దారితీస్తుందనే భయాందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రష్యా వాదనపై అమెరికా ప్రతినిధి ఒకరు తీవ్రంగా వ్యతిరేకించారు. రష్యా చెబుతున్నట్టుగా శాంతి పరిరక్షణ అనేది ఒక నాన్ సెన్స్ అంటూ ఆయన చెప్పారు. యుక్రెయిన్‌పై రష్యా దాడికి దిగితే త్వరలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా కూడా గట్టిగానే హెచ్చరించింది. యుక్రెయిన్‌ మీద దండయాత్రకు రష్యా సిద్ధంగా ఉందని అమెరికా బలంగా నమ్ముతోంది. ఈ క్రమంలోనే అమెరికా ప్రతినిధి ఒకరు దీనిపై ప్రస్తావించారు.
Read Also : Ukraine Crisis: యుక్రెయిన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం

రష్యా అధ్యక్షుడి తీరుపై విమర్శలు :
రష్యా అధ్యక్షుడు ప్రసంగించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పుతిన్ ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి రాత్రి పొద్దుపోయాక అత్యవసరంగా సమావేశమైంది. శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని నివారించటానికి దౌత్య ప్రయత్నాలు తప్పక జరగాలని పలు దేశాలు పిలుపునిచ్చాయి. యుక్రెయిన్ విషయంలోనూ ఇదే జరిగింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలంటూ ఒకవైపు భారత్ చెబుతూనే ఉంది. యుక్రెయిన్‌లో తాజా పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ప్రస్తావించారు.

Ukraine Crisis Russia Orders Troops Into Rebel Held Regions, These Are Things Happen In Hours

ప్రస్తుత ఉద్రికత్త పరిస్థితులు మరింతగా దిగజారే చర్యలను నివారించాలని ఐక్యరాజ్య సమతిలో చైనా రాయబారి ఝాంగ్ జున్ భద్రతామండలి సమావేశంలో సూచించారు. సంక్షోభానికి దౌత్య పరిష్కారం కోసం జరిగే ప్రతి ప్రయత్నాన్నీ చైనా ఆహ్వానిస్తోందన్నారు. స్వతంత్ర ప్రాంతాల మీద యుక్రెయిన్ దురాక్రమణకు పాల్పడుతోందన్నారు. దాని నుంచి వేర్పాటు ప్రాంతాలను రక్షించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ఐరాసలో రష్యా రాయబారి వాసిలి నెబెన్జ్యా వాదించారు. దౌత్య చర్చలకు రష్యా కూడా సుముఖంగానే ఉందని ఆయన అన్నారు. రష్యా చర్యలతో యుక్రెయిన్ సార్వభౌమత్వం, సమగ్రతను అతిక్రమించినట్టే అవుతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు వాలోద్‌మిర్ జెలెన్స్కీ తప్పుపట్టారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన… రష్యా ఎలాంటి ప్రకటనలు ఇచ్చినప్పటికీ యుక్రెయిన్ అంతర్జాతీయ సరిహద్దులు యధాతధంగా ఉంటాయన్నారు.

ఉక్రెయిన్‌‌కు ఎయిరిండియా సర్వీసులు..
మరోవైపు.. యుక్రెయిన్‌లోని ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి తీసుకొచ్చేందుకు  యుక్రెయిన్‌కు ప్రత్యేక విమాన సర్వీసులను ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఒక మొదటి ఎయిర్ ఇండియా విమానం యుక్రెయిన్‌కు బయలుదేరింది. ఫిబ్రవరి 24న మరో ఎయిర్ ఇండియా విమానం బయల్దేరనుంది. ఫిబ్రవరి 26న మరో విమానం యుక్రెయిన్‌కు వెళ్లనున్నాయి. ఇదిలా ఉండగా.. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల మధ్య తూర్పు యుక్రెయిన్‌లోకి సైనిక బలగాలను పంపించాలన్న పుతిన్ నిర్ణయం తీసుకోవడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతేకాదు.. ఆసియా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లో ఇన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Read Also : Ukraine Crisis: యుక్రెయిన్ నుంచి భారత్ కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం

ట్రెండింగ్ వార్తలు