The Kashmir Files: ‘ది కశ్మీర్ ఫైల్స్’పై అమీర్ ఖాన్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏదైనా హాట్ టాపిక్‌గా నడుస్తుందంటే అవి ఖచ్చితంగా రెండు సినిమాల గురించే అని చెప్పాలి. ఒకటి బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’, రెండోది.....

The Kashmir Files: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏదైనా హాట్ టాపిక్‌గా నడుస్తుందంటే అవి ఖచ్చితంగా రెండు సినిమాల గురించే అని చెప్పాలి. ఒకటి బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’, రెండోది టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలపై భారతదేశ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌పై తెలుగు ఆడియెన్స్‌తో పాటు యావత్ దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొనడంతో ఈ సినిమాను చూసేందుకు అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇండియావైడ్‌గా నిర్వహిస్తూ దూసుకుపోతోంది. అయితే తాజాగా జరిగిన ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ ప్రమోషన్స్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పాల్గొన్నారు.

The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ జోరు.. ఆర్ఆర్ఆర్‌కు దెబ్బ పడుతుందా?

ఈ క్రమంలో అమీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మీరు ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం చూశారా అని విలేకరులు అమీర్ ఖాన్‌ను ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇస్తూ.. ‘‘వర్క్ బిజీ వల్ల ఇంకా ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని చూసే అవకాశం రాలేదు. దేశచరిత్రలో జరిగిన విచారకరమైన ఘటన ఆధారంగా తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాల్సిన చిత్రం. కశ్మీర్ పండితులపై జరిగిన తిరుగుబాటు చాలా విచారకరం. ఇలాంటి ఘటనలపై వచ్చిన సినిమాను మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేయడం ఖాయం. ఇలాంటి సినిమాలు మున్ముందు ఇంకా రావాలి.’’ అని అమీర్ ఖాన్ అన్నారు.

The Kashmir FIles: ”ద కశ్మీర్ ఫైల్స్’ ఆదాయాన్ని బ్రాహ్మణ కుటుంబాలకు విరాళమివ్వండి

అయితే ఇలాంటి సినిమాలు మంచి విజయాలను అందుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఇలాంటి చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇతర దర్శకనిర్మాతలు కూడా దేశచరిత్రలో జరిగిన ఇలాంటి ఘటనలు, వాటిలోని వాస్తవాలను నిర్భయంగా చూపించేందుకు ముందుకు వస్తారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్‌లో ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై అమీర్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు