Rahul Dravid : అయ్యో ద్ర‌విడ్‌కు ఎన్ని క‌ష్టాల్లో..! ‘ఇక‌పై నేను నిరుద్యోగిని.. నాకో ఉద్యోగం చూడండి..’

ఇక‌పై తాను నిరుద్యోగిన‌ని త‌న‌కు ఏమైన జాబ్ ఆఫ‌ర్లు ఉంటే చెప్పాల‌ని ద్ర‌విడ్ అన్నాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 భార‌త్ సొంతమైంది. యావ‌త్ భార‌త్ సంబ‌రాల్లో మునిగిపోయింది. ఇక మైదానంలో ప్లేయ‌ర్లే ఆడిన‌ప్ప‌టికి కూడా ఈ విజ‌యంలో టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కీల‌క పాత్ర పోషించాడు. ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌డం, జ‌ట్టు కూర్పు వంటి విష‌యాల్లో ద్ర‌విడ్ చేసిన కృషిని త‌క్కువ చేయ‌లేం.

2007లో ద్ర‌విడ్ సార‌థ్యంలో భార‌త్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోసం వెస్టిండీస్‌లో అడుగుపెట్టింది. దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ కూడా భార‌త్ తొలి రౌండ్‌లోనే అవ‌మాన‌క‌ర రీతిలో నిష్ర్క‌మించింది. కాలం గిర్రున తిరిగింది. 17 ఏళ్ల త‌రువాత ద్ర‌విడ్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం క‌రేబియ‌న్ దీవుల్లో అడుగుపెట్టాడు. అయితే.. ఈ సారి ఆట‌గాడిగా కాదు కోచ్‌గా వ‌చ్చాడు. పొగొట్టుకున్న చోటే వెతుకున్న‌ట్లుగా.. 2007 నాటి చేదు జ్ఞాప‌కాల‌ను చెరిపేసుకున్నాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాల‌ని అనుకోలేదు.. అయితే..

ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా ద్ర‌విడ్ భావోద్వేగాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డు. అయితే.. ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంతో ఉద్వేగానికి లోనైయ్యాడు. ఆట‌గాళ్ల‌తో క‌లిసి సెల‌బ్రేష‌న్స్ చేస్తుకున్నాడు. ఆ త‌రువాత మీడియాతో మాట్లాడుతూ.. ఇక‌పై తాను నిరుద్యోగిన‌ని త‌న‌కు ఏమైన జాబ్ ఆఫ‌ర్లు ఉంటే చెప్పాల‌ని ద్ర‌విడ్ వారితో స‌ర‌దాగా అన్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగిసిన సంగ‌తి తెలిసిందే.

న‌వంబ‌ర్ 2021లో హెడ్‌కోచ్‌గా ద్ర‌విడ్ బాధ్య‌త‌లు చేపట్టాడు. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌తోనే ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగిసింది. అయితే.. బీసీసీఐ కోరిక మేర‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 వ‌ర‌కు కొన‌సాగాడు. విజేత‌గా నిలిచిన త‌రువాత ద్ర‌విడ్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం త‌న‌కు మాట‌లు రావ‌డం లేద‌న్నాడు. క‌ఠిన ప‌రిస్థితుల్లో గొప్ప‌గా పోరాడిన ఈ జ‌ట్టు ప‌ట్ల గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు చెప్పాడు. తానెంతో క‌ష్ట‌ప‌డినా కూడా ఓ ప్లేయ‌ర్‌గా ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వ‌లేక‌పోయాన‌న్నాడు.

Rohit Sharma : ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌రువాత రోహిత్ శ‌ర్మ వ్యాఖ్య‌లు.. మేం కాదు.. ఈ ప్ర‌పంచ‌క‌ప్ అందుకునేందుకు అస‌లైన అర్హుడు అత‌డే..

అయితే.. ఇవ‌న్నీ ఆట‌లో స‌హ‌జం అన్నాడు. ఈ విజ‌యాన్ని 2007లో ఎదురైన ఓట‌మికి ఊర‌ట‌గా భావించ‌డం లేద‌న్నాడు. కోచ్‌గా త‌న ప‌నిని తాను నిర్వ‌ర్తించాన‌ని, కుర్రాళ్ల‌కు మార్గ‌నిర్దేశ‌నం చేశాన‌న్నాడు. భార‌త జ‌ట్టుతో ప్ర‌యాణం అద్భుతంగా సాగింద‌న్నాడు. ఎన్నో ఏళ్ల శ్ర‌మ‌తో ద‌క్కిన ఈ విజ‌యం జీవిత‌కాల జ్ఞాప‌కం అని చెప్పాడు. వ‌చ్చే వారం నుంచి తాను నిరుద్యోగిగా మారిపోతున్నాన‌ని ఏమైనా జాబ్ ఆఫ‌ర్లు ఉంటే చెప్పాల‌ని స‌ర‌దాగా అన్నాడు.

ట్రెండింగ్ వార్తలు