Sudheer Babu : పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న నవ దళపతి..

ఓ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో భారీ బ‌డ్జెట్ తో సుధీర్ బాబు సినిమా చేయబోతున్నాడు.

Sudheer Babu : సుధీర్ బాబు సినిమా ఫలితాలు ఎలా ఉన్నా ప్రతిసారి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇటీవలే హరోం హర సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించాడు. ఈ సినిమాతో సుధీర్ బాబు నవ దళపతిగా టాలీవుడ్ లో సరికొత్తగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు.

ఓ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో భారీ బ‌డ్జెట్ తో సుధీర్ బాబు సినిమా చేయబోతున్నాడు. బాలీవుడ్ లో రుస్తుం, టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్‌, ప‌రి.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ప్రేర‌ణ అరోరా నిర్మాణంలో సుధీర్ బాబు పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ప్రేర‌ణ అరోరా, శివిన్ నార‌గ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ కథకు పురాణాల‌కు కూడా లింక్ ఇస్తూ అద్భుతంగా ప్లాన్ చేయబోతున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా షూట్ మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఫ‌స్ట్ లుక్‌ను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తామని కూడా ప్రకటించారు. అలాగే ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చ్ లో శివరాత్రికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తామని తెలిపారు మూవీ యూనిట్.

Also Read : Kalki Collections : ‘కల్కి’ వీకెండ్ కలెక్షన్స్ అదిరిపోయాయి.. మొత్తం నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు..?

ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా టీమ్ తో ఏడాది నుంచి ట్రావెల్ అవుతున్నాను. చాలా కొత్త కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్ష‌క‌ల ముందుకు ఎప్పుడు తీసుకురావాలా అని ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు