Rohit Sharma : రోహిత్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాల‌ని అనుకోలేదు.. అయితే..

రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ.. తాను టీ20 క్రికెట్ నుంచి త‌ప్పుకోవాల‌ని అనుకోలేద‌ని విలేక‌రుల‌తో చెప్పాడు.

Rohit Sharma retirement t20 : 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. రోహిత్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచింది. గెలిచిన ఆనందంలో భార‌త అభిమానులు ఉండ‌గా.. కొద్ది క్ష‌ణాల్లోనే వారికి రెండు షాకులు త‌గిలాయి. మొద‌టగా టీ20 క్రికెట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు స్టార్ ఆట‌గాడు కోహ్లి ప్ర‌క‌టించ‌గా.. మ‌రికాసేప‌టికే మీడియా స‌మావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ తాను కూడా పొట్టి ఫార్మాట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు చెప్పాడు.

పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్ప‌డానికి ఇంత‌కంటే మంచి స‌మ‌యం ఉండ‌ద‌న్నాడు. “ఇది నా చివరి గేమ్‌. వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదు. టీ20 ప్ర‌పంచక‌ప్ గెల‌వాల‌ని చాలా బ‌లంగా కోరుకున్నాను. సాధించాను.’ అని రోహిత్ అన్నాడు. రోహిత్ శ‌ర్మ త‌న కెరీర్‌లో 159 టీ20 మ్యాచులు ఆడాడు. ఐదు సెంచరీలు, 32 అర్ధ సెంచరీలతో 4231 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ కూడా టెస్టు, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతాన‌ని వెల్ల‌డించాడు.

Dinesh Karthik : ఆర్సీబీ జట్టులోకి దినేశ్ కార్తీక్ రీఎంట్రీ.. ఈసారి ప్లేయర్ గా కాదు..

విరాట్ కోహ్లి నుంచి కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించాడు రోహిత్ శ‌ర్మ. అత‌డి నాయ‌క‌త్వంలో 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు సెమీఫైన‌ల్‌కు చేరుకుంది. అయితే.. సెమీఫైన‌ల్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇక స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లోనూ రోహిత్ నాయ‌త‌క్వంలోనే భార‌త్ ఆడింది. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ ఫైన‌ల్‌కు చేరుకుంది. అయితే.. ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

టీ20ల‌కు వీడ్కోలు చెప్పాల‌ని అనుకోలేదు..

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఇందులో రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ.. తాను టీ20 క్రికెట్ నుంచి త‌ప్పుకోవాల‌ని అనుకోలేద‌ని విలేక‌రుల‌తో చెప్పాడు. అయితే.. ప్ర‌స్తుత ప‌రిస్థితులను అర్థం చేసుకుని త‌ప్పుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

‘టీ20ల నుంచి రిటైర్ అవుతానని అనుకోలేదు, కానీ పరిస్థితి అలా ఉంది. నాకు కూడా ఇదే సరైంద‌ని అనిపిస్తోంది. కప్ గెలిచి వీడ్కోలు చెప్పడం కంటే గొప్ప గౌర‌వం ఏమి ఉంటుంది.’ అని రోహిత్ వీడియోలో పేర్కొన్నాడు.

దిగ్గజాల రిటైర్మెంట్.. టీమిండియా ఫ్యూచర్ పరిస్థితి ఏంటి?

రోహిత్ శ‌ర్మ టీ20ల‌కు వీడ్కోలు చెప్ప‌డంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్య పొట్టి ఫార్మాట్‌లో భార‌త్‌కు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

ట్రెండింగ్ వార్తలు