Dinesh Karthik : ఆర్సీబీ జట్టులోకి దినేశ్ కార్తీక్ రీఎంట్రీ.. ఈసారి ప్లేయర్ గా కాదు..

టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, 2025 ఐపీఎల్ సీజన్ లో..

Dinesh Karthik : ఆర్సీబీ జట్టులోకి దినేశ్ కార్తీక్ రీఎంట్రీ.. ఈసారి ప్లేయర్ గా కాదు..

Dinesh Karthik

Dinesh Karthik RCB : మాజీ టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్ 2025లో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ జట్టు తరపున ఆడిన దినేశ్ కార్తీక్.. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్ లలో దినేశ్ కార్తీక్ ను మిస్ అవుతామని అతని ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ, దినేశ్ కార్తీక్ ఐపీఎల్ 2025లో మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అదికూడా ఆర్సీబీ జట్టు నుంచే. అయితే, ఈసారి ప్లేయర్ గా కాదు.. జట్టు బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్ గా కార్తీక్ కొత్త పాత్రను పోషించబోతున్నాడు. ఈ మేరకు ఆర్సీబీ ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో కార్తీక్ ఆ విషయాన్ని వెల్లడించాడు.

Also Read: ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇప్పుడు రవీంద్ర జడేజా

దినేశ్ కార్తీక్ కు ప్రస్తుతం 39ఏళ్లు. అతను ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ (2008) నుంచి ఆడుతూ వచ్చాడు. ఐపీఎల్ కెరీర్ లో డిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కేకేఆర్ ప్రాంచైజీలకు ఆడాడు. 2024 సీజన్ లో ఆర్సీబీ ప్రాంచైజీకి ఆడిన దినేశ్ కార్తీక్ అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. 187.35 స్ట్రైక్ రేటుతో 326 పరుగులు చేశాడు. కానీ, ఆర్సీబీ జట్టు మాత్రం ఆ సీజన్ లో ఘోరంగా విఫలమైంది.

Also Read : అప్పట్లో అలా బ్యాటింగ్.. ఇప్పుడు ఇలా బౌలింగ్.. టీమిండియాలో భారీ ఛేంజ్

ఐపీఎల్ లో దినేశ్ కార్తీక్ ప్లేయర్ గా విజయవంతం అయ్యాడనే చెప్పొచ్చు. గత సీజన్ లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, 2025 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్ గా కార్తీక్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. వచ్చే సీజన్ (2025) నుంచి డీకే కొత్త విధుల్లో చేరతాడని ఆర్సీబీ పేర్కొంది. సరికొత్త అవతారంలో మరోసారి మాలో భాగమవుతున్న దినేశ్ కార్తీక్ కు స్వాగతం అని ఆర్సీబీ తన ఎక్స్ ఖాతాలో రాసింది.