Harleen Deol – Suryakumar Yadav : టీమ్ఇండియా మరోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను టీమ్ఇండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుందంటూ పలువురు మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు కావాలి. హార్దిక్ బౌలింగ్ ప్రారంభించాడు. క్రీజులో మిల్లర్ ఉండటంతో దక్షిణాఫ్రికే విజయం అని అంతా భావించారు. హార్దిక్ తొలి బంతి వేయగానే.. మిల్లర్ భారీ షాక్ కొట్టాడు. బాల్ సిక్స్‌గా వెలుతుందని అనుకుంటుండగా.. మెరుపు వేగంతో దూసుకువచ్చిన సూర్యకుమార్ యాదవ్.. గాల్లోకి ఎగిరి బౌండరీ బయట పడబోయే బాల్ ను అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. అయితే.. అతడు బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ బయట అడుగు పెట్టే క్రమంలో చేతిలోని బాల్ ను సూర్య గాల్లోకి విసిరాడు.. తిరిగి బౌడరీ బయటకు వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుత క్యాచ్ తో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
కాగా.. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మూడేళ్ల క్రితం టీమ్ఇండియా మహిళా క్రికెటర్ హర్లీన్ డియోన్ అందుకున్న క్యాచ్ ఒకేలా ఉన్నాయంటూ ఎక్స్‌లో ఓ నెటిజన్ తెలిపారు. “ఇలాంటి క్యాచ్‌ను హర్లీన్ డియోల్ అందుకుంది.. మీకు గుర్తుందా?,” అని పేర్కొన్నారు. ప్రస్తుతం హర్లీన్ డియోన్ క్యాచ్ వీడియో వైరల్‌గా మారింది.
2021 జూలై 10న భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్లు టీ20 మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ను శిఖా పాండే వేసింది. ఈ ఓవర్లోని ఓ బంతిని ఇంగ్లాండ్ బ్యాటర్ అమీ భారీ షాట్ గా కొట్టేందుకు ప్రయత్నించింది. బౌండరీ వద్ద ఆ బంతిని అందుకొనేందుకు హర్లీన్ డియోల్ అద్భుతమే చేసింది. తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్ చేసి అందుకొంది. అయితే బౌండరీ దాటుతున్నానని గ్రహించి బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్ చేసింది.
ప్రస్తుతం సూర్యకుమార్, హర్లీన్ డియోల్ క్యాచ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
A similar catch like the one by Surya Kumar Yadav was taken by Harleen Deol. Hope we all remember?. pic.twitter.com/DakFietVAx
— KV Iyyer – BHARAT 🇮🇳🇮🇱 (@BanCheneProduct) June 30, 2024