Aircraft Crash in Paris
Aircraft Crash in Paris : ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నేషనల్ హైవేపై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. పలువురికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. చిన్న ప్యాసింజర్ విమానం తక్కువ ఎత్తులో వెళ్తుంది. ఈ క్రమంలో విద్యుత్ వైర్లను తాకడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
Also Read : Dinesh Karthik : ఆర్సీబీ జట్టులోకి దినేశ్ కార్తీక్ రీఎంట్రీ.. ఈసారి ప్లేయర్ గా కాదు..
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. విమానం కూలిపోవడంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విమానం గాల్లోకి ఎగిరిన అరగంట సేపు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. హై ఓల్టేజీ విద్యుత్ వైర్లను తాకడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనపై విమాన సేఫ్టీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ విమాన ప్రమాదంలో పైలెట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హైవేపై విమానం కూలిన సమయంలో వాహనాల రద్దీ ఉంది. కానీ, ఈ ప్రమాదంలో ఏ వాహనం కూడా దెబ్బతినలేదని స్థానిక పోలీసులు తెలిపారు.