2024 Elections: వచ్చే లోక్‭సభ ఎన్నికల్లో బీజేపీ కుంభస్థలాన్ని దెబ్బకొట్టేందుకు కీలక పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్, ఆప్

కొద్ది రోజుల క్రితం జరిగి గుజరాత్‌ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలైంది. వాస్తవానికి ఆప్ పోటీనే కాంగ్రెస్ కే పెద్ద అడ్డంకి అయింది

AAP and Congress: లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో విపక్షాలు, అధికార పార్టీలు చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా పొత్తులు, ఎత్తులు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కీలకమైన గుజరాత్ రాష్ట్రాన్ని టార్గెట్ చేశాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆప్ సీనియర్ నేత ఇసుదాన్ గధ్వి సోమవారం ప్రకటించారు. ఈ రెండు పార్టీలు భారత ఇండియా కూటమిలో ఉన్న విషయం తెలిసిందే.

Supreme Court: బీహార్‭లో కులగణనపై స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

కాంగ్రెస్, ఆప్ సీట్లు పంపకాలు చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయని గధ్వీ తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న 26 స్థానాలను బీజేపీ గెలుచుకోదని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు రాష్ట్రంలోని మొత్తం స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కొద్ది రోజుల క్రితం జరిగి గుజరాత్‌ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలైంది. వాస్తవానికి ఆప్ పోటీనే కాంగ్రెస్ కే పెద్ద అడ్డంకి అయింది. ఆప్ దాదాపు 13 శాతం ఓట్లు సాధించి 5 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోయి, కాంగ్రెస్ కేవలం 17 సీట్లకు పరిమితమైంది.

Independence Day 2023 : భారత్‌తో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకునే దేశాలు

కాంగ్రెస్ ఓటమికి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ కారణమని అప్పట్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 52.50 శాతం ఓట్లను సాధించింది. ఇక కాంగ్రెస్ కు 27.28 శాతం, ఆప్ కు 12.92 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే.. 40 శాతం ఓట్లు అవుతాయి. ఇది కొన్ని స్థానాలను పెంచుతుంది. అలాగే బీజేపీ విజయ ప్రవాహాన్ని కొంత వరకు నిలువరిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రెండు పార్టీ పొత్తు బీజేపీకి ఎంతో కొంత నష్టాన్ని తప్పక చూపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు