Independence Day 2023 : భారత్‌తో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకునే దేశాలు

స్వేచ్చా స్వాతంత్ర్యాలు..అనేవి ఏ దేశానికైనా గర్వకారణాలు. దేశ జాతి యావత్తు జరుపుకునే జెండా పండుగ. మువ్వన్నెల జెండా పండుగ జరుపుకోవటానికి భారతదేశం సిద్ధమైంది. స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్న ప్రతీ భారతీయులు మువ్వన్నెలతో మురిసిపోతున్నారు.

Independence Day 2023

Independece day : తెల్లదొరల పాలనలో దాదాపు 200 ఏళ్లు మగ్గిపోయిన భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాత్రంత్ర్యం సాధించింది. ఈ స్వాతంత్ర్య సమయంలో ఎంతోమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారి ఆశలు..ఆశయాలు నెరవేరేలా భారత్ ఆగస్టు 17న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు దాటిపోయింది. మరో స్వాతంత్ర్య వేడుకలకు భారత్ సిద్ధమవుతోంది. ప్రతీ భారతీయుడు గుండెలు ఉప్పొంగేలా స్వాతంత్ర్య వేడుకలకు భారత్ సిద్ధమవుతోంది.మువ్వన్నెల జెండా రెపరెపలతో భారత మురిసిపోనుంది.

రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించిన బ్రీటీష్ దొరలు ఎన్నో దేశాలను ఆక్రమించుకుని పాలించారు. ఈనాడు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పుకుంటున్న ఎన్నో దేశాలను కూడా బ్రిటీషర్లు పాలించినవే. అందుకే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అంటారు ఆగస్టు 15న భారత్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనుంది. ఈ క్రమంలో భారత్ తో పాటు మరికొన్ని దేశాలు కూడా అదే రోజున అంటే ఆగస్టు 15న స్వాత్రంత్ర్య వేడుకలు జరుపుకోనున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం..

Independence Day 2023 : పోస్టాఫీసుల్లో రూ.25కే త్రివర్ణ పతాకం, ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆగస్టు 15 జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. భారత్ తో పాటు ఆగస్టు 15న బహ్రెయిన్(Bahrain), ఉత్తర కొరియా(North Korea), దక్షిణ కొరియా ( South Korea)లీచ్‌టెన్‌స్టెయిన్ (Liechtenstein),ఆఫ్రియా దేశమైన కాంగో (Republic of the Congo)దేశాలు కూడా తమ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

బహ్రెయిన్ (Bahrain) 
బహ్రెయిన్కిం గ్డం ఆఫ్ బహ్రయిన్ అంటారు. ఇది ఒక చిన్న ద్వీపదేశం. గల్ఫ్ పశ్చిమతీరంలో ఉంది. ఇది కూడా ఎన్నో దేశాల వలే బ్రిటిష్ వలస పాలనను కూడా అనుభవించిన బహ్రెయిన్, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండు దశాబ్దాల తరువాత ఆగష్టు 15, 1971 న స్వాతంత్ర్యం ప్రకటించింది. బహ్రెయిన్‌లో స్వాతంత్య్రం బహ్రెయిన్ జనాభాపై ఐక్యరాజ్యసమితి సర్వేను అనుసరించింది. ఆ తర్వాత 1960 ప్రారంభంలో సూయెజ్‌కు తూర్పున ఉన్న సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని బ్రిటిష్ వారు ప్రకటించారు. బహ్రెయిన్‌లో స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో బహ్రెయిన్ దేశానికి..యూకేకు (గ్రేట్ బ్రిటన్)మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ తేదీన దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని బహ్రెయిన్ జరుపుకోదు. దీనికి బదులుగా దివంగత పాలకుడు ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సింహాసనాన్ని అధిష్టించిన రోజుకు గుర్తుగా డిసెంబర్ 16 నేషనల్ డేగా జరుపుకుంటుంది. ఆరోజునే సెలవు దినంగా పాటిస్తుంది.

ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు..
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలు. ఈ రెండు దేశాలు ఏటా ఆగస్టు 15 ను జాతీయ విమోచన దినోత్సవంగా జరుపుకుంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన ఈ రోజున 35 సంవత్సరాల జపాన్ ఆక్రమణ ఉత్తర కొరియా దక్షిణ కొరియా దేశాలలో ముగిసింది. కొరియాపై వలస పాలన ముగిసింది. ఉత్తర, దక్షిణ కొరియాల కు మద్దతుగా యుద్ధంలో పోరాడిన మిత్ర దళాలు ఈ రెండు దేశాలను ఆక్రమణల నుంచి విముక్తులను చేశాయి. ఆగస్టు 15ని దక్షిణ కొరియాలో ‘గ్వాంగ్‌బోక్జియోల్’ గా పిలుస్తారు. అంటే కాంతి తిరిగి వచ్చిన రోజుగా పిలుస్తారు.

ఆగస్టు 15ని అదే రోజుని ఉత్తరకొరియా మాత్రం ‘చోగుఖేబాంగై నల్’ అనిపిలుస్తారు. అంటే ఫాదర్ల్యాండ్ డే విమోచనం రోజుగా భావిస్తారు.

లీచ్టెన్‌స్టెయిన్ (Liechtenstein)
ప్రపంచంలోని ఆరవ అతి చిన్న దేశం. ఆగస్టు 15, 1866లో జర్మన్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. స్వాతంత్ర్య వేడుకల్ని చేసుకుంటుంది. లీచ్టెన్‌స్టెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మధ్య ఉన్న ఆల్ప్స్ యూరోపియన్ హైలాండ్స్‌లో ఉన్న జర్మన్ మాట్లాడే మైక్రోస్టేట్, ఆగస్టు 15 ని జాతీయ దినంగా జరుపుకుంటుంది. ఆగస్టు 15న బ్యాంకు సెలవు దినంగా పాటిస్తుంది. అలాగే క్రీస్తు ఏసు తల్లి మేరీ మాత జన్మించిన ఊహను ఆగష్టు 15 నే జరుపుకుంటారు. అంతేకాదు వారికి స్వాతంత్ర్యం వచ్చే సమయంలో పాప్రిన్స్ ఫ్రాంజ్ జోసెఫ్ II, ఆగస్టు 16 న జన్మించారు. దీంతో లీచ్టెన్‌స్టెయిన్ జాతీయ సెలవుదినం పండుగను, ప్రిన్స్ పుట్టినరోజును కలిపి ఆగస్టు 15న జాతీయ దినంగా జరుపుకుంటుంది.

 

republic of the congo

కాంగో (Republic of the Congo)
ఆఫ్రికన్ దేశమైన కాంగో కూడా ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. మధ్య ఆఫ్రికా లోని దేశం. 1960లో..కాంగో ఫ్రాన్స్ పాలన నుండి స్వతంత్ర్యం పొందింది. దీంతో కాంగో రిపబ్లిక్ అయింది. కాంగోను 1880లో ఫ్రాన్స్ ఆక్రమించింది. అప్పుడు దీనిని ఫ్రెంచ్ కాంగో అని పిలుస్తారు. అయితే 1903 తరువాత దీనిని మిడిల్ కాంగో అని పిలుస్తున్నారు. దీన్నే కాంగో బ్రజ్జావిల్లె, చిన్న కాంగో లేదా కాంగోఅని కూడా అంటారు. కాంగోకు సరిహద్దులుగా పడమరన గాబన్, నైరుతిగా కామెరూన్, వాయువ్యాన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, తూర్పునజైరే, ఆగ్నేయాన అంగోలా ఆక్రమించిన కబిండా, పక్కనే గినియా జలసంధి ఉన్నాయి. 1960లో స్వతంత్రం వచ్చిన తరువాత మధ్య కాంగోలోని ఫ్రెంచి ప్రాంతమంతా కాంగో గణతంత్ర రాజ్యంగా మారింది.ఈ కాంగో మార్క్సిజం, లెనినిజం అవలంబించే ఏక పార్టీ రాజ్యంగా 1970 నుండి1991 వరకూ ఉంది.బహుళ పార్టీ ఎన్నికలు1992లో జరిగాయి.1997 అంతర్యుద్ధంలో ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసేశారు.

ట్రెండింగ్ వార్తలు