కేంద్ర బడ్జెట్లో బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ఏఏ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయో తెలుసా..

క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేసింది. దీంతో క్యాన్సర్ రోగులు వినియోగించే మందులు తక్కువ ధరకే లభించనున్నాయి.

Minister Nirmala Sitharaman

Budget 2024 : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి బడ్జెట్ ను మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో వివిధ రంగాలకు సంబంధించి పలు ప్రకటనలు చేశారు. ప్రభుత్వం చాలా రంగాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించింది.

Also Read : Budget 2024 : అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు

క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేసింది. దీంతో క్యాన్సర్ రోగులు వినియోగించే మందులు తక్కువ ధరకే లభిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదేవిధంగా మొబైల్, మొబైల్ చార్జర్ తో సహా ఇతర పరికరాలపై బీసీడీ 15శాతం తగ్గించింది. అదేవిధంగా.. బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని 6శాతం తగ్గించింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. అదేవిధంగా లెదర్ తో తయారుచేసే పాదరక్షలపైనా కస్టమ్ సుంకం తగ్గించారు. అయితే.. టెలికాం పరికరాల ధరలు పెరగనున్నాయి. దానిపై కస్టమ్ సుంకం 15శాతం పెరిగింది. అదేవిధంగా..  సీఫుడ్ చౌకగా లభించనున్నాయి.

Also Read : Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు నిధుల వరద.. తెలంగాణకు నిరాశ

తగ్గిన వస్తువుల జాబితాలో..
మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీలపై పన్ను రేటును కూడా తగ్గించారు. దీంతో భారతదేశంలో ఫోన్‌లను తయారు చేయడానికి కంపెనీలకు చౌకగా అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు.
క్యాన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి మినహాయించబడ్డాయి.
సోలార్ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే మినహాయింపు పొందిన మూలధన వస్తువుల జాబితాను విస్తరించాలని కూడా నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.
ఇ-కామర్స్‌పై టీడీఎస్ రేటు 1శాతం నుండి 0.1 శాతానికి తగ్గింపు.
ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగించబడింది.
లెదర్ వస్తువులు, సీఫుడ్ చౌకగా లభించనున్నాయి.

పెరిగిన జాబితాలో..
అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్‌లపై 25 శాతానికి పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
నిర్దేశిత టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 10శాతం నుంచి 15 శాతానికి పెంచారు.

 

ట్రెండింగ్ వార్తలు