Rajamouli – Netflix : తెలుగు హీరోలకు తెలుగు డబ్బింగ్ ఏంటి.. రాజమౌళి డాక్యుమెంటరీ.. నెట్ ఫ్లిక్స్ ప్రయోగంపై విమర్శలు..

నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన రాజమౌళి డాక్యుమెంటరీ తెలుగు ట్రైలర్ పై చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Audience Fires on Netflix Rajamouli Modern Masters Documentary Telugu Trailer

Rajamouli – Netflix : డైరెక్టర్ రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ ‘మోడ్రన్ మాస్టర్స్’ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్నే ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో జేమ్స్ కామెరూన్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, కరణ్ జోహార్, రమా రాజమౌళి.. ఇలా పలువురు రాజమౌళి గురించి మాట్లాడారు. రాజమౌళి కూడా మాట్లాడాడు. ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్లో వీళ్లంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడారు. ట్రైలర్ బాగుండటంతో రాజమౌళి డాక్యుమెంటరీ కోసం తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తర్వాత రాజమౌళి డాక్యుమెంటరీ తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో మన తెలుగు హీరోలు మాట్లాడిన మాటలు కూడా వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. రాజమౌళికి కూడా ఎవరో డబ్బింగ్ చెప్పారు. ట్రైలర్ మొత్తం హాలీవుడ్ సినిమాలకు డబ్బింగ్ లు చెప్పే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించడంతో విమర్శలు వస్తున్నాయి. తెలుగు హీరోలు, తెలుగు డైరెక్టర్ అయి ఉండి కూడా వాళ్ళతో తెలుగు మాట్లాడించుకోకుండా వేరే వాళ్ళతో తెలుగు డబ్బింగ్ చెప్పించడం ఏంటని విమర్శలు చేస్తున్నారు.

Also Read : Rana Naidu 2 : ‘రానా నాయుడు’ మళ్ళీ మొదలు.. సీజన్ 2 షూటింగ్..

నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన రాజమౌళి డాక్యుమెంటరీ తెలుగు ట్రైలర్ పై చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుల్ డాక్యుమెంటరీ మాత్రం తెలుగులో రిలీజ్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా డబ్బింగ్ మాత్రం చెప్పించి నాశనం చేయొద్దు అని ట్రైలర్ కింద కామెంట్స్ చేస్తున్నారు. మరి నెట్ ఫ్లిక్స్ ఏం చేస్తుందో చూడాలి. ఇక ఈ రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మీరు కూడా ఆ తెలుగు డబ్బింగ్ ట్రైలర్ చూడండి..

ట్రెండింగ్ వార్తలు