కర్ణాటకలో 25వేళ్లతో పుట్టిన మగబిడ్డ.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..?

కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్‌లో అరుదైన శిశువు జన్మించింది. ఓ తల్లి 25వేళ్లు కలిగిన మగ బిడ్డకు జన్మనిచ్చింది.

Baby born with 25 fingers

Baby Born With 13 Fingers in Karnataka : కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్‌లో అరుదైన శిశువు జన్మించింది. ఓ తల్లి 25వేళ్లు కలిగిన మగ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు చేతులకు 13వేళ్లు, కాళ్లకు 12 వేళ్లు ఉన్నాయి. కుడి చేతికి ఆరు వేళ్లు, ఎడమ చేతికి ఏడు వేళ్లు ఉన్నాయి. అదే సమయంలో ఒక్కో కాలుకు ఆరు వేళ్లు చొప్పున రెండు కాళ్లకు 12వేళ్లు ఉన్నాయి. బాగల్‌కోట్‌ జిల్లాలోని రబక్వి బనహట్టిలోని సన్ షైన్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈ పాప జన్మించింది. అరుదైన ఈ శిశువును చూసిన కుటుంబ సభ్యులు దేవుడు ఇచ్చిన బిడ్డగా భావిస్తున్నారు. తల్లి భారతికి 35 సంవత్సరాలు. తల్లీ, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

Also Read : Kalki Part 2 : వాట్.. చిట్టీలు వేసి కల్కి పార్ట్ 2 తీద్దామని డిసైడ్ అయ్యారా? ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..

పూర్తి ఆరోగ్యంతో అరుదైన మగబిడ్డ జన్మించడం పట్ల తల్లి భారతి సంతోషం వ్యక్తం చేసింది. శిశువు తండ్రి గురప్ప కోనూరు, కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నామని వారు తెలిపారు. అయితే, ఈ పరిస్థితిని పాలిడాక్టిలీ అని పిలుస్తారని వైద్యులు చెప్పారు. ఇది అరుదైన జన్యుక్రమరాహిత్యం, దీని ఫలితంగా శిశువుల్లో అదనపు వేళ్లు, అదనపు కాలివేళ్లు ఏర్పడతాయని చెప్పారు.2023లో కూడా ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ లోని డీగ్ జిల్లాలో ఒక అమ్మాయి పుట్టింది. ఆమె చేతులు, కాళ్లలో మొత్తం 26వేళ్లు ఉన్నాయి. అప్పుడు పుట్టిన ఆడ బిడ్డకు ఒక్కో చేతికి ఏడు వేళ్లు, ఒక్కో పాదానికి ఆరు వేళ్లు ఉన్నాయి.

క్రోమోజోమ్ ల అసమతుల్యత వల్ల ఈ చిన్నారి అరుదైన కేసుగా మారిందని సన్ షైన్ ఆస్పత్రి గైనకాలజిస్ట్ తెలిపారు. ప్రస్తుతం బిడ్డ, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఇద్దరికీ కొన్ని రోజులు కొంత జాగ్రత్త అవసరమని చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు