Supreme Court: బీహార్‭లో కులగణనపై స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

బీహార్‭లో ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన ప్రతిపాదనను శాసనసభ 18 ఫిబ్రవరి 2019న శాసన మండలి 27 ఫిబ్రవరి 2020న ఆమోదించాయి. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది

Caste Census: బిహార్ రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టేటస్ కో విధించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. పూర్తి స్థాయిలో విచారణ తరువాతే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామంటూ తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. బీహార్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ కులగణన సర్వేను సమర్ధిస్తూ పాట్నా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీన్ని సవాలు చేస్తూ జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఆ పటిషన్ ను విచారణకు తీసుకున్న అనంతరం పైవిధంగా అభిప్రాయపడ్డారు.

Kokapet: కోకాపేట్ భూముల వేలంతో సత్తా చాటిన హైదరాబాద్ రియల్ బ్రాండ్.. అక్కడ కూడా పెరగనున్న ధరలు!

బీహార్‌లోని నతీశ్ కుమార్ ప్రభుత్వం జనవరి 7 న కుల ఆధారిత జనాభా గణనను ప్రారంభించనుంది. రూ.500 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను అమితంగా ప్రభావితం చేయనున్నట్లు రాజకీయ పండితులు అంటున్నారు. వాస్తవానికి చాలా కాలంగా కుల ఆధారిత జనాభా గణన చేయాలని డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఓబీసీల స్థితిగతులను ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని దాటవేస్తూ వస్తోంది. బిహార్‭లోని అన్ని స్థానిక రాజకీయ పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి. అయినప్పటికీ కేంద్రం మౌనం వీడకపోవడంతో నితీశ్ ప్రభుత్వమే తమ రాష్ట్రంలో కులగణను ప్రారంభించింది.

Nadendla Manohar: ఆ నియోజకవర్గం నాదే.. పోటీపై క్లారిటీ ఇచ్చిన జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్

అయితే దీన్ని సవాలు చేస్తూ పాట్నా హైకోర్టులో మొదట పిటిషన్ దాఖలైంది. ఆ సమయంలో కులగణన చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పాట్నా హైకోర్టు తొలుత తీర్పు ఇచ్చింది. పాట్నా హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు మే 4న తాత్కాలిక స్టే విధించింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాలు చేసింది. ఈ కేసును తిరిగి పాట్నా హైకోర్టుకే తిరిగి పంపింది దేశ అత్యున్నత ధర్మాసనం. దీనిపై హైకోర్టులో ఐదు రోజుల పాటు విచారణ కొనసాగింది. అనంతరం జులై 7న కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. పాట్నా హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరిస్తూ కుల గణనపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు తీర్పు చెప్పింది. కురగణనకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీంతో కులగణన చేపట్టేందుకు బిహార్ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.

Uttar Pradesh: టోల్ చార్జ్ అడిగినందుకు టోల్ ప్లాజా ఉద్యోగిని కారుతో తొక్కి చంపి పరారైన దుండగుడు

బీహార్‭లో ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన ప్రతిపాదనను శాసనసభ 18 ఫిబ్రవరి 2019న శాసన మండలి 27 ఫిబ్రవరి 2020న ఆమోదించాయి. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. బీహార్‌లో కులగణన జనవరి 2023లో ప్రారంభమైంది. ఇది రెండు దశల్లో జరగాల్సి ఉంది. 1951 నుండి ఎస్సీ, ఎస్టీల కులాల డేటా సేకరిస్తున్నారు. కానీ ఓబీసీ సహా ఇతర కులాల డేటా అందుబాటులో లేదని బీహార్ ప్రభుత్వం జనాభా గణన గురించి చెబుతోంది. 1990లో కేంద్రంలోని అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల రెండవ కమిషన్ సిఫార్సును అమలు చేసింది. 1931 జనాభా లెక్కల ఆధారంగా, ఓబీసీలు దేశ జనాభాలో 52 శాతం ఉన్నట్లు అంచనా వేశారు.

ట్రెండింగ్ వార్తలు