Kokapet: కోకాపేట్ భూముల వేలంతో సత్తా చాటిన హైదరాబాద్ రియల్ బ్రాండ్.. అక్కడ కూడా పెరగనున్న ధరలు!

కోకాపేట్ భూముల వేలం తరువాత ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజల్లో సైతం ఇప్పుడు నమ్మకం పెరిగింది.

Kokapet Land Auction

Kokapet Boom: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Hyderabad Real Estate) చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. కోకాపేట్ భూముల వేలం (Kokapet Land Auction) కేక పెట్టించింది. నియోపోలిస్ భూముల వేలంలో ఎకరం ఏకంగా వంద కోట్ల రూపాయల ధర పలికింది. తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) ఎకరం వంద కోట్లు ధర పలకడం ఆల్ టైం రికార్డ్. హెచ్ఎండీఏ (HMDA) వేలంతో హైదరాబాద్ రియల్ బ్రాండ్ సత్తా ఏంటో మరోసారి రుజువైంది.

ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్‌తో టీ-సర్కార్‌ ట్రిపుల్‌-వన్‌ జీవోను ఎత్తివేసింది. దీంతో 84 గ్రామాల్లోని లక్షా 32 వేల ఎకరాల భూములు అందుబాటులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌తో సహా పరిసరాల్లోని భూముల ధరలు పడిపోతాయన్న ప్రచారం జరిగింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కూడా పడిపోతుందని, నిర్మాణరంగం చతికిలపడిపోతుందనే చర్చ ఊపందుకుంది. దీంతో రియాల్టీ వర్గాల్లో సైతం ఒకింత సందిగ్ధం నెలకొంది.

ట్రిపుల్ వన్ జీవో ఎత్తేయడంతో హైదరాబాద్‌లో భూముల ధరలు పడిపోతాయన్న భయాన్ని పటాపంచలు చేసింది కోకాపేట్ భూముల వేలం. కోకాపేట్‌లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ ఫేజ్-2లో ఎకరం ఏకంగా వంద కోట్ల రూపాయల ధర పలికింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎకరం వంద కోట్ల రూపాయలు పలకడం ఆల్ టైం రికార్డుగా చెప్పుకోవచ్చు. కోకాపేట్ వేలంతో హైదరాబాద్ రియల్ బ్రాండ్ వ్యాల్యూ మరోసారి ప్రపంచానికి తెలిసింది. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో అంతర్జాతీయ మౌళిక వసతులు, ఇక్కడ ఏర్పాటవుతున్న ఐటీ కంపెనీలు, ఉపాధి అవకాశాలు, సుస్థిరమైన ప్రభుత్వ పాలన, ఆహ్లాదకరమైన వాతావరణం, శాంతి భద్రతలు వంటి చాలా అంశాలు హైదరాబాద్ రియల్ బ్రాండ్ వ్యాల్యూను రోజురోజుకు పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే కోకాపేట్‌లో ఎకరం వంద కోట్ల రూపాయల ధర పలికింది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో సరి కొత్త రికార్డు నమోదైంది. నియోపోలిస్ భూముల వేలంలో ఎకరం ఏకంగా వంద కోట్ల రూపాయల ధర పలికింది. అంతర్జాతీయ మౌళిక వసతులతో ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు తెచ్చుకుంది. దిగ్గజ ఐటీ, ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌కు క్యూకట్టడంతో ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం దినదినాభివృద్ది చెందుతోంది. ఇప్పటికే దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో భాగ్యనగరానికి చక్కని బ్రాండ్ నేమ్ ఉంది. ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ రియల్ బ్రాండ్ వ్యాల్యూ సత్తా చాటుతూ ఆల్ టైం రికార్డు స్థాయిలో భూముల ధరలు పలికి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కోకాపేట్‌లో ఎకరం వంద కోట్ల రూపాయలు పలికింది. హెచ్‌ఎండీఏ కోకాపేట్ నియోపోలిస్‌ ఫేజ్‌-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్‌ చరిత్రలో ఎకరం 100 కోట్ల ధర పలకడం ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి.

Also Read: ఎకరం 100 కోట్లపైనే.. ఇంతకీ కోకాపేట నియోపోలిస్ ప్లాట్ల ప్రత్యేకత ఏంటి? వాటికి ఎందుకంత భారీ డిమాండ్?

కోకాపేట్ భూములు రికార్డు స్థాయిలో ధర పలకడం రియల్ మార్కెట్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. నియో పోలిస్‌లో హెచ్ఎండీఏ ఎకరం భూమికి 35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను నిర్ణయించింది. ఈ-వేలంలో దిగ్గజ రియాల్టీ రంగ సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర వంద కోట్ల 75 లక్షల రూపాయలు కాగా.. అత్యల్పంగా 67 కోట్ల 25 లక్షల రూపాయలు పలికింది. కోకాపేట్ భూముల వేలం తరువాత హైదరాబాద్‌లోని మిగతా ప్రాంతాల్లోను ఇదే తరహాలో భూముల ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంతే కాదు ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని భూముల ధరలు సైతం పెరగనున్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

Also Read: క్లీంకార విషయంలో చిరు చెప్పింది నిజమేనా..? కోకాపేట భూముల ధరకు మెగా వారసురాలికి సంబంధం..!

కోకాపేట్ భూముల వేలం తరువాత ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజల్లో సైతం ఇప్పుడు నమ్మకం పెరిగింది. ఐటీ హబ్ కు కూత వేటు దూరంలో ఉన్నా.. తమ భూములు ఎకరా 2 కోట్ల రూపాయల ధర కూడా పలకడం లేదని ఇన్నాళ్లు ట్రిపుల్ వన్ జీవోపరిధిలోని రైతులు ఆవేదన చెందూతూ వస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కారు ట్రిపుల్ వన్ జీవోఎత్తేయడం, ఇప్పుడు కొకపెట్ లో ఎకరం వంద కోట్ల ధర పలకడంతో తమ భూములకు సైతం భారీగా ధర వస్తుందన్న ధీమా వ్యక్తం అవుతోంది.

Also Read: ఎకరం వందకోట్లు.. కోకాపేట ఆంటీ అప్పుడే చెప్పింది..

ఇప్పటివరకు ఎకరం 2 కోట్ల రూపాయలు పలికిన ట్రిపుల్ వన్ జీవోభూములకు సైతం 10 నుంచి 15 కోట్ల పైనే ధర వస్తుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సామాన్యుడికి ఈ ప్రాంతం ఇక అందని ద్రాక్షగా మారబోతోంది. ఇప్పటికే ఇక్కడ వెంచర్లు ఉన్న సంస్థలు కోకాపేట భూమ్‌తో రేట్లను పెంచేసే పనిలో పడ్డారు. ఏకంగా 300 నుంచి వెయ్యి రూపాయల వరకు స్క్వేర్ ఫీట్ ధరను పెంచేయడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఏదేమైనా కోకాపేటలో ఎకరాకు 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలంటోంది ప్రభుత్వం.

ట్రెండింగ్ వార్తలు