Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ఎందుకంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో
- Harish Thanniru
- Published on- July 21, 2024 / 07:43 AM IST
Gold and Silver Price Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. వెయ్యికిపైగా తగ్గుదల చోటు చేసుకుంది. మరోవైపు కిలో వెండిపై రూ. 2,850 తగ్గింది. తాజాగా ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,800 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,970.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,950 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 74,120.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,800 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,970.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,620కు చేరింది.
వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా ఆదివారం వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 97, 650.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.97,650.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 93,150 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.93,150.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 91,650 వద్ద కొనసాగుతుంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
