Gold Silver Prices Today: పండుగవేళ పసిడి ప్రియులకు షాక్.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?
అంతర్జాతీయ మార్కెట్లో ఒత్తిడి ఉన్నప్పటికీ, దేశీయంగా కొద్దిపాటి విరామం తర్వాత బంగారం,(Gold Silver Prices Today) వెండి ధరలు మళ్లీ లాభాల బాట పట్టాయి.
Gold Silver Prices Today 26 October 2026 In Hyderabad Visakhapatnam Full Details
Gold Silver Prices Today: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ కోలుకున్నాయి. ఇటీవలి తగ్గుదల నుంచి ఉపశమనం పొందుతూ అక్టోబర్ 26న ధరలు స్వల్ప లాభాల దిశగా అడుగులు వేశాయి. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర 0.21 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,42,810కి చేరగా, కేజీ వెండి ధర 0.36 శాతం పెరిగి రూ.1,97,300 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే ఫ్యూచర్స్ మార్కెట్ అయిన ఎంసీఎక్స్‌లో డిసెంబర్ పసిడి కాంట్రాక్టులు 0.21 శాతం లాభపడి రూ.1,42,810 వద్ద, వెండి ఫ్యూచర్స్ 0.37 శాతం పెరిగి రూ.1,97,303 వద్ద కొనసాగాయి.
KTR: ‘సిరిసిల్ల నా కులం, తెలంగాణ నా గోత్రం’.. కేటీఆర్ భావోద్వేగ కామెంట్స్!
అంతర్జాతీయ మార్కెట్లో ఒత్తిడి.. $4,000 దిగువకు చేరిన స్పాట్ గోల్డ్:
దేశీయంగా ధరలు పెరిగినప్పటికీ, గ్లోబల్ మార్కెట్లో పసిడిపై (Gold Silver Prices Today)ఒత్తిడి కొనసాగుతోంది. అంతర్జాతీయ ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.6 శాతం క్షీణించి ఔన్సుకు 3,998.49 డాలర్లకు పడిపోయింది. జులై మధ్యకాలం తర్వాత పసిడి ధర 4,000 డాలర్ల దిగువకు చేరడం ఇదే తొలిసారిగా నమోదైంది. ఇంధన ధరల పెంపు వల్ల ద్రవ్యోల్బణ ఆందోళనలు తీవ్రమవ్వడం, రాబోయే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు వడ్డీ రేట్లను ఉన్నత స్థాయిలోనే కొనసాగిస్తారనే అంచనాలు అంతర్జాతీయ పసిడి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి.
ప్రధాన నగరాల్లో తాజా రేట్లు.. స్వచ్ఛత ఆధారంగా బంగారం ధరల వివరాలు:
దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ రేట్లను పరిశీలిస్తే, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,42,770 గానూ, 22 క్యారెట్లు రూ.1,30,873 గానూ ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా మరియు చెన్నైలలో కూడా 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,42,300 నుండి రూ.1,42,780 ల మధ్యన ట్రేడ్ అయ్యాయి. సాధారణంగా రిటైల్ మార్కెట్లో ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని వాడగా, అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని పెట్టుబడుల కోసం 999 ఫైన్ సిల్వర్‌తో పాటు నాణేలు, బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేస్తుంటారు.
