Kalki Part 2 : వాట్.. చిట్టీలు వేసి కల్కి పార్ట్ 2 తీద్దామని డిసైడ్ అయ్యారా? ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..

కల్కి సినిమాకి పార్ట్ 2 ఉందని సినిమా చివర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Nag Ashwin Interesting post on Kalki Movie Part 2

Kalki Part 2 : ప్రభాస్ కల్కి సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. థియేటర్స్ లో భారీ హిట్ కొట్టి ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. సినిమాలో మహాభారతం సీన్స్, యాక్షన్ సన్నివేశాలను అందరూ అభినందించారు. కల్కి సినిమా ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.

అయితే కల్కి సినిమాకి పార్ట్ 2 ఉందని సినిమా చివర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్ట్ 2 కోసం ఇప్పట్నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు. ఆల్రెడీ కొంచెం షూటింగ్ కూడా అయిపోయిందని, 2025లో రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు నిర్మాత. అయితే కల్కి సినిమాని రెండు పార్టులుగా తీయాలని ఎలా డిసైడ్ అయ్యారో తెలుసా.

Also Read : Sanusha : కష్టపడి మాస్టర్స్ పూర్తిచేసిన ‘జెర్సీ’ భామ.. పవన్ కళ్యాణ్ తో కూడా నటించిందని తెలుసా..?

తాజాగా నాగ్ అశ్విన్ 2 అనే నెంబర్ రాసి ఉన్న ఒక పేపర్ ని ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. కల్కిని రెండు పార్టులుగా తీయాలని ఈ మెథడ్ తో డిసైడ్ అయ్యాం అంటూ తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అంత పెద్ద కల్కి సినిమాని రెండు పార్టులుగా తీయాల వద్దా అని చిట్టీలు వేసుకొని చిట్టిల్లో 2 వస్తే పార్ట్ 2 తీయాలని ఫిక్స్ అయ్యారని నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్ గా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కొందరు సరదాగా చెప్తున్నారేమో అని, నాగ్ అశ్విన్ పై సరదాగా చిట్టీలు వేసి కల్కి పార్ట్ 2 తీద్దామని డిసైడ్ అయ్యారా అని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు