Sanusha : కష్టపడి మాస్టర్స్ పూర్తిచేసిన ‘జెర్సీ’ భామ.. పవన్ కళ్యాణ్ తో కూడా నటించిందని తెలుసా..?

తాజాగా నటి సనూషా స్కాట్లాండ్ లో MSc పూర్తి చేసింది.

Sanusha : కష్టపడి మాస్టర్స్ పూర్తిచేసిన ‘జెర్సీ’ భామ.. పవన్ కళ్యాణ్ తో కూడా నటించిందని తెలుసా..?

Actress Sanusha Completed MSc from University of Edinburgh Scotland Shares Emotional Post

Updated On : July 23, 2024 / 8:49 AM IST

Sanusha : మన సెలబ్రిటీలు కొంతమంది సినిమాల్లో నటిస్తూ కూడా చదువుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి సనూషా స్కాట్లాండ్ లో MSc పూర్తి చేసింది. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసిన సనూషా తెలుగులో పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో మీరాచోప్రా చెల్లెలి పాత్రలో నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తుంది సనూషా.

సనూషా తెలుగులో జీనియస్ సినిమాతో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. నాని సూపర్ హిట్ సినిమా జెర్సీలో సనూషా కీలక పాత్ర చేసింది. అయితే జెర్సీ సినిమా తర్వాత సనూషా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తుంది. అయితే ఈ గ్యాప్ లో సనూషా స్కాట్లాండ్ కి వెళ్లి MSc చేసింది. తాజాగా MSc
గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకున్న ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ ఎమోషనల్ నోట్ రాసింది.

Also Read : Sirivennela Seetharama Sastry : ఆ పాట రాయడం కోసం సీతారామ శాస్త్రిని మొదటిసారి పబ్‌కి తీసుకెళ్లిన దర్శకుడు..

సనూషా తన MSc గ్రాడ్యుయేషన్ ఫోటోలు పోస్ట్ చేసి.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో సార్లు ఏడ్చాను. ఇంటికి దూరంగా ఉండి ఎన్నో పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్ చేస్తూ చదువుకున్నాను. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి.. ఇలా ఇబ్బందులు పడ్డాను. చివరికి సాధించాను. నాకు అండగా నిలిచి, నన్ను జాగ్రత్తగా చూసుకున్న నా కుటుంబ సభ్యులకు, నాకు తోడుగా ఉన్న స్నేహితులకు అందరికి ధన్యవాదాలు. ఈ విజయాన్ని మీ అందరికి అంకితమిస్తున్నాను. నేను స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో గ్లోబల్ మెంటల్ హెల్త్ అండ్ సొసైటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్‌ పట్టాను పొందాను అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమెని అభినందిస్తూ కంగ్రాట్స్ తెలుపుతున్నారు.